Prabhas: కృష్ణంరాజు గారి మరణం కారణంగా, గత కొన్ని రోజులుగా షూటింగ్లకు గ్యాప్ ఇచ్చిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఇప్పుడు తిరిగి షూటింగ్ లో పాల్గొంటున్నాడు. కేజీఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రాబోతున్న చిత్రం సాలార్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన లీకెడ్ పిక్ ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తుంది.
Prabhas: కృష్ణంరాజు మరణంపై ప్రభాస్ సోషల్ మీడియా పోస్ట్.. ఎమోషనల్ గా ఉన్న వీడియో!
ఇటీవల షూటింగ్ లో పాల్గున్న ప్రభాస్ పై చిత్ర యూనిట్ ఒక కీలక సన్నివేశాని చిత్రీకరిస్తున్నారు. ఆ సమయంలో గుట్టుగా తీసిన వర్కింగ్ స్టిల్ ఫోటో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. మూవీ మేకర్స్ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, సినిమాకు సంబంధించి ఏదో ఒకటి బయటపడుతూనే ఉంది.
ఈ సినిమాలో ప్రభాస్ కు జంటగా శ్రుతి హాసన్ నటిస్తుంది. భారీ అంచనాలు మధ్య తెరకెక్కుతున్న ఈ మూవీ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ చాలా ఆతురతగా ఎదురు చూస్తున్నారు. ఇక ప్రభాస్ బర్త్ డేకి చిత్ర యూనిట్ మూవీ లోని ప్రభాస్ లుక్ ని విడుదల చేస్తారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
#Prabhas anna ?? #Salaar bhai on duty ??#salaar leaked pic pic.twitter.com/kvlwV9vE96
— Darling (@DarlingDHFP05) September 24, 2022