×
Ad

Salaar : ప్రభాస్ అభిమానులకు మళ్ళీ నిరాశే.. సలార్ సినిమా వాయిదా కన్ఫర్మ్..

గత రెండు రోజులుగా సలార్ సినిమా వాయిదా పడుతుందని వార్తలు వస్తున్నాయి. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ పూర్తి కాలేదని, సీజీ వ‌ర్క్ ఇంకా అవ్వలేదని అందుకే సినిమా వాయిదా పడుతుందని ఇండస్ట్రీ సమాచారం.

  • Published On : September 2, 2023 / 03:17 PM IST

Prabhas Salaar Movie Postpone again movie not releasing on September

Salaar Movie : ప్రశాంత్ నీల్(Prashanth Neel) దర్శకత్వంలో ప్ర‌భాస్ (Prabhas) హీరోగా తెరకెక్కుతున్న సినిమా సలార్ (Salaar). ఈ సినిమాలో శ్రుతి హాసన్(Shruti Haasan) హీరోయిన్ గా న‌టిస్తోంది. మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran), జగపతి బాబు(Jagapathi Babu) విలన్స్ గా, శ్రియారెడ్డి కీల‌క పాత్ర‌ను పోషించింది. సెప్టెంబ‌ర్ 28న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వస్తుందని ప్రకటించారు చిత్రయూనిట్. ఇక ఈ సినిమా రెండు పార్టులుగా వస్తుందని, ఇటీవల మొదటి పార్ట్ గ్లింప్స్ కూడా రిలీజ్ చేసి సినిమాపై భారీ హైప్ పెంచారు.

దీంతో బాహుబలి 2 సినిమా తర్వాత సరైన హిట్ లేక ప్రభాస్ అభిమానులు ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే సలార్ సినిమా అనేకసార్లు వాయిదా పడింది. సినిమా రిలీజ్ కి కొన్ని రోజులే టైం ఉంది. సెప్టెంబర్ 6న ట్రైలర్ కూడా రిలీజ్ చేస్తారని, త్వరలోనే ప్రమోషన్స్ మొదలుపెడతారని అంతా భావించారు. కానీ సలార్ విడుదల మళ్ళీ వాయిదా పడనున్నట్లు తెలుస్తుంది.

గత రెండు రోజులుగా సలార్ సినిమా వాయిదా పడుతుందని వార్తలు వస్తున్నాయి. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ పూర్తి కాలేదని, సీజీ వ‌ర్క్ ఇంకా అవ్వలేదని అందుకే సినిమా వాయిదా పడుతుందని ఇండస్ట్రీ సమాచారం. దీంతో స‌లార్ సినిమా సెప్టెంబ‌ర్ 28కి విడుద‌ల కావ‌డం లేద‌ని తెలుస్తుంది. ప్రస్తుతానికి వాయిదా పడిన సలార్ సినిమాని దీపావళికి నవంబర్ లో రిలీజ్ చేస్తారని సమాచారం. సలార్ వాయిదా పడిందని పలువురు సినీ పీఆర్వోలు, ఇండస్ట్రీ ప్రముఖులు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుండటంతో సలార్ వాయిదా కన్ఫర్మ్ అని ఫిక్స్ అయ్యారు. దీంతో ప్రభాస్ అభిమానులు మరోసారి నిరాశ చెందుతున్నారు.

Kushi Movie Collections : ఖుషి ఫస్ట్ డే కలెక్షన్స్.. విజయ్ కెరీర్‌లోనే హైయెస్ట్.. సమంత స్టార్‌డమ్ బాగానే పనిచేసింది..

త్వరగా సినిమా రిలీజ్ చేయమని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ఇప్పటికే పలు మార్లు వాయిదా పడ్డ సలార్ మరోసారి వాయిదా పడింది. ఈ వాయిదాతోనైనా ఆగుతుందా? ఈ సారైనా మళ్ళీ చెప్పిన టైంకి తీసుకొస్తారా చూడాలి. ఇక కొత్త రిలీజ్ డేట్ ని త్వరలోనే ప్రకటిస్తారని సమాచారం. సలార్ పార్ట్ 1 ఇన్ని సార్లు వాయిదా పడిందంటే ఇంకా పార్ట్ 2 ఎప్పుడు రిలీజ్ చేస్తారో అని మరో సందేహం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు.