Salaar Collections : బాక్సాఫీస్‌ని బద్దలు కొట్టిన సలార్.. ఆరు రోజుల్లోనే సరికొత్త రికార్డ్ కలెక్షన్స్.. డంకీ కంటే చాలా ఎక్కువ..

సలార్ సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ ఏకంగా 178.7 కోట్ల గ్రాస్ ని అందుకొని సరికొత్త రికార్డ్ సెట్ చేసింది.

Prabhas Salaar Part 1 Cease Fire Movie Six Days Collections Full Details

Salaar Collections : ప్రశాంత్ నీల్(Prashanth Neel) దర్శకత్వంలో ప్రభాస్(Prabhas) సలార్ సినిమాతో గతవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. పార్ట్ 1 సీజ్ ఫైర్ థియేటర్స్ లో భారీ విజయం సాధించింది. మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకొని ప్రభాస్ అభిమానులకు సంతోషాన్ని ఇచ్చింది. సలార్ సినిమాతో ప్రభాస్ మరోసారి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ సునామి సృష్టిస్తున్నాడు. సలార్ సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ ఏకంగా 178.7 కోట్ల గ్రాస్ ని అందుకొని సరికొత్త రికార్డ్ సెట్ చేసింది.

ఇక సలార్ సినిమా డిసెంబర్ 22న రిలీజయింది. నిన్నటి వరకు ఆరు రోజుల్లోనే 500 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి బాక్సాఫీస్ దగ్గర చెలరేగిపోతుంది. ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. దీంతో ప్రభాస్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బాహుబలి తర్వాత మళ్ళీ ఆ రేంజ్ హిట్ పడకపోవడంతో ఇన్నాళ్లు నిరాశలో ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్ సలార్ హిట్ తో ఊపిరి పీల్చుకుంటున్నారు.

ఇక సలార్ సినిమా షారుఖ్ డంకీకి పోటీగా దిగిన సంగతి తెలిసిందే. కానీ ప్రభాస్ హవా ముందు షారుఖ్ డంకీ వెలవెలబోయింది. మొదటి రోజు నుంచి కూడా కలెక్షన్స్ లో డంకీని డామినేట్ చేస్తూ వస్తుంది సలార్. సలార్ మొదటి రోజు 178 కోట్లు వసూలు చేయగా డంకీ మాత్రం 40 కోట్లే వసూలు చేసింది. ఇక ఇప్పటి వరకు డంకీ సినిమా కేవలం 250 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. దీంతో సలార్ కి డంకీకి దాదాపు 200 కోట్లకు పైగా కలెక్షన్స్ డిఫరెన్స్ ఉంది. ఇక సలార్ సినిమా నైజాంలోనే దాదాపు 100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్టు సమాచారం. అలాగే అమెరికాలో 7 మిలియన్ డాలర్స్ వరకు కలెక్ట్ చేసింది.

Also Read : Salaar : ఖాన్సార్ నిబంధన అంటూ హుకుం జారీ చేసిన రాజమన్నార్.. ఏంటో తెలుసా..?

నార్త్ లో ప్రభాస్ సలార్ సినిమాకు థియేటర్స్ ఇవ్వకపోయినా, సినిమాకు A సర్టిఫికెట్ వచ్చినా ఈ రేంజ్ లో వసూలు చేస్తుంది. లేదంటే సలార్ ఇప్పటికే కనీసం 700 కోట్ల వరకు వెళ్తుందని భావిస్తున్నారు. సలార్ ప్రభంజనం ఇంకా కొనసాగనుంది. ఈ వారం పెద్ద సినిమాలు ఏమి లేకపోవడంతో సలార్ కలెక్షన్స్ అలాగే కొనసాగుతాయని భావిస్తున్నారు.