Salaar Movie : సలార్ పార్ట్ 2 రిలీజ్ అప్పుడేనా? పార్ట్ 1 ఇంకా రాలేదు పార్ట్ 2 గురించి చర్చ..

సలార్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. కన్నడ సినీ పరిశ్రమలో సలార్ కి పనిచేసిన వారు ఇటీవల ఏదో ఒక వార్త ఈ సినిమా గురించి మాట్లాడుతున్నారు. తాజాగా సలార్ పార్ట్ 2 గురించి కన్నడలో టాక్ వినిపిస్తుంది.

Prabhas Salaar Part 2 Movie Release Date update before Releasing Part 1 Cease Fire Rumours goes Viral

Salaar Movie : ప్రశాంత్ నీల్(Prashanth Neel) దర్శకత్వంలో ప్ర‌భాస్ (Prabhas) హీరోగా తెరకెక్కుతున్న సినిమా సలార్ (Salaar). ఈ సినిమా రెండు పార్టులుగా రానుంది. పార్ట్ 1 సీజ్ ఫైర్ టీజర్ తో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా డిసెంబర్ 22న ప్రేక్ష‌కుల ముందుకు వస్తుందని ప్రకటించారు చిత్రయూనిట్. బాహుబలి 2 సినిమా తర్వాత సరైన హిట్ లేక ప్రభాస్ అభిమానులు ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు.

సలార్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. కన్నడ సినీ పరిశ్రమలో సలార్ కి పనిచేసిన వారు ఇటీవల ఏదో ఒక వార్త ఈ సినిమా గురించి మాట్లాడుతున్నారు. తాజాగా సలార్ పార్ట్ 2 గురించి కన్నడలో టాక్ వినిపిస్తుంది. సలార్ పార్ట్ 1 సినిమా డిసెంబర్ లో రిలీజ్ చేస్తుండగా పార్ట్ 2ని వచ్చే సంవత్సరం వేసవి కానుకగా ఏప్రిల్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే రెండు పార్టులకు సంబంధించిన షూటింగ్ పూర్తయిందని, పార్ట్ 1 రిలీజ్ అయ్యాక పార్ట్ 2 పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెడతారని తెలుస్తుంది.

దీంతో సలార్ పార్ట్ 1 ఇప్పటికే అనేక సార్లు వాయిదా పడి ఇంకా రిలీజ్ అవ్వకముందే పార్ట్ 2 గురించి చర్చ జరుగుతుండటం విశేషం. ఇక పార్ట్ 1లో భారీ యాక్షన్ సీక్వెన్స్ లు ప్లాన్ చేశారట. ఈ యాక్షన్ సన్నివేశాల కోసం ఒక సపరేట్ సెట్ వేశారని, వీటి కోసం దాదాపు 700 లకు పైగా వాహనాలు ఉపయోగించినట్లు సమాచారం. దీంతో సలార్ పార్ట్ 1 పై మరిన్ని అంచనాలు పెరిగాయి.

Also Read : Mega Brothers : మెగా బ్రదర్స్ ఫోటో షేర్ చేస్తూ.. మా మధ్య ఎన్ని విభేదాలు వచ్చినా.. నాగబాబు ఎమోషనల్ పోస్ట్..

ఇక ఈ సినిమాలో శ్రుతి హాసన్(Shruti Haasan) హీరోయిన్ గా న‌టిస్తోంది. మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran), జగపతి బాబు(Jagapathi Babu) విలన్స్ గా, శ్రియారెడ్డి కీల‌క పాత్ర‌లో కనిపించనుంది.

ట్రెండింగ్ వార్తలు