Mega Brothers : మెగా బ్రదర్స్ ఫోటో షేర్ చేస్తూ.. మా మధ్య ఎన్ని విభేదాలు వచ్చినా.. నాగబాబు ఎమోషనల్ పోస్ట్..
తాజాగా మెగా బ్రదర్ నాగబాబు తమ ముగ్గురు బ్రదర్స్ కలిసి ఉన్న ఫొటోని తన సోషల్ మీడియాలో షేర్ చేసి ఎమోషనల్ పోస్ట్ చేశారు.

Naga Babu shares Mega Brothers Photo from Varun Lavanya Marriage
Mega Brothers : మెగా హీరో వరుణ్ తేజ్(Varun Tej), హీరోయిన్ లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) నవంబర్ 1న వివాహంతో ఒక్కటయ్యారు. ఈ వివాహానికి మెగా ఫ్యామిలీ, ఇరు కుటుంబాలు, పలువురు సినీ ప్రముఖుల మధ్య ఇటలీలోని టస్కనీలో హిందూ సాంప్రదాయం ప్రకారం వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలు వరుసగా ఒక్కొక్కటి బయటకి వస్తున్నాయి.
ఇప్పటికే వరుణ్ – లావణ్య పెళ్ళికి సంబంధించిన పలు ఫోటోలు, మెగా ఫ్యామిలీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మెగా ఫ్యామిలీ అంతా ఒక్కో ఫోటో షేర్ చేస్తున్నారు. ఫ్యామిలీ ఫోటోల కోసం, వరుణ్ లావణ్య పెళ్లి ఫోటోల కోసం, పవన్ కళ్యాణ్ ఫోటోల కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. తాజాగా మెగా బ్రదర్ నాగబాబు తమ ముగ్గురు బ్రదర్స్ కలిసి ఉన్న ఫొటోని తన సోషల్ మీడియాలో షేర్ చేసి ఎమోషనల్ పోస్ట్ చేశారు.
Also Read : VarunLav : తాళి కడుతున్న వరుణ్.. సంతోషంలో లావణ్య..
వరుణ్ పెళ్ళిలో చిరంజీవి(Chiranjeevi), నాగబాబు(Nagababu), పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ముగ్గురు కలిసి దిగిన ఫోటోని షేర్ చేస్తూ.. మా మధ్య ఎన్ని విభేదాలు, వాదనలు రెగ్యులర్ గా వచ్చినా మా బంధం మాత్రం ఎప్పటికి ప్రత్యేకంగా ఉంటుంది. మేము చేసిన పనులు, మా జ్ఞాపకాలు మాత్రమే కాదు, మా మధ్య ఏర్పడే విభేదాల కంటే మా అనుబంధం ఎంతో ముఖ్యమైనది. మా రిలేషన్ షిప్ ఎన్నో మంచి క్షణాలపై ఆధారపడి ఉంది. మా మధ్య రిలేషన్ నిజంగా చాలా బలమైనది, విడదీయలేనిది అంటూ ఎమోషనల్ గా పోస్ట్ చేశారు నాగబాబు. దీంతో మెగా బ్రదర్స్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.