Prabhas : తన షూటింగ్ లేకపోయినా మూవీ సెట్స్‌కి వెళ్తున్న ప్రభాస్.. ఆ సినిమాపై స్పెషల్ కేర్..

Prabhas Fauzi: సాధారణంగా హీరోలు తమకు షూటింగ్ కి లేకపోతే మూవీ సెట్స్ కి వెళ్లరు. కానీ ప్రభాస్ మాత్రం షూటింగ్ లేకపోయినా మూవీ సెట్ కి వెళ్తున్నారంట.

  • Updated on- August 13, 2026 / 03:14 PM IST

Prabhas Fauzi Movie

Prabhas Fauzi: సాధారణంగా హీరోలు తమకు షూటింగ్ కి లేకపోతే మూవీ సెట్స్ కి వెళ్లరు. తమకు సంబంధించిన సీన్స్ లేకపోతే అసలు షూటింగ్ సైడ్ కి కూడా వెళ్లరు హీరోలు. కానీ వరుస సినిమా షూటింగ్స్ తో బిజీ ఉన్న ప్రభాస్ మాత్రం తనకు షూటింగ్ లేకపోయినా మూవీ సెట్ కి వెళ్తున్నారంట. ప్రభాస్ ప్రస్తుతం ఫౌజీ, స్పిరిట్, కల్కి షూటింగ్స్ తో బిజీగా ఉన్నాడు.

Also Read – Anupama Parameswaran : ఎట్టకేలకు తన బ్రేకప్ స్టోరీ చెప్పిన అనుపమ.. టాక్సిక్ రిలేషన్ షిప్ అంటూ..

తాజాగా రవితేజ ఇరుముడి సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ భీమవరంలో జరగ్గా ఫౌజీ నిర్మాత మైత్రి రవిశంకర్ మాట్లాడుతూ.. ప్రభాస్ కి భీమవరం వెళ్తున్నాను అని చెప్పాను. ఇక్కడ కాలేజీలో స్టూడెంట్స్ ని బాగా చదువుకోమని చెప్పమన్నారు. ఫౌజీ విషయంలో ఎలాంటి తేడా జరగదు. ఎందుకంటే ఫౌజీ సినిమాని ప్రభాస్ దగ్గరుండి మరీ చూసుకుంటున్నారు. రోజూ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ప్రభాస్ ఫౌజీ సెట్స్ లోనే ఉంటున్నారు. తన సీన్స్ షూటింగ్ లేకపోయినా సెట్స్ కి వచ్చి అలా మానిటర్ ముందు కూర్చొని అంతా గమనిస్తున్నారు. ఫౌజీ సినిమా వేరే లెవల్ లో ఉంటుంది అని అన్నారు.

దీంతో మైత్రి రవి కామెంట్స్ వైరల్ గా మారాయి. హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్, ఇమాన్వి జంటగా ప్రేమ-యుద్ధం నేపథ్యంలో ఈ ఫౌజీ సినిమా భారీగా తెరకెక్కుతుంది. డిసెంబర్ 3న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ఎప్పుడూ లేనిది ప్రభాస్ ఇలా షూటింగ్ లేకపోయినా మూవీ సెట్స్ కి వెళ్లి కేర్ తీసుకుంటున్నారు అని తెలియడంతో ఫౌజీ సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది.