Anupama Parameswaran : ఎట్టకేలకు తన బ్రేకప్ స్టోరీ చెప్పిన అనుపమ.. టాక్సిక్ రిలేషన్ షిప్ అంటూ..
తాజాగా అనుపమ పరమేశ్వరన్ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన లవ్ బ్రేకప్ స్టోరీ గురించి సంచలన విషయాలు తెలిపింది. (Anupama Parameswaran)
Anupama Parameswaran
Anupama Parameswaran : అనుపమ పరమేశ్వరన్ గత కొన్నాళ్లుగా ఓ హీరోతో ప్రేమాయణంలో ఉందని వార్తలు రాగా ఇటీవల కొన్ని రోజుల క్రితమే వారిద్దరూ విడిపోయారని కూడా వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో అనుపమ కూడా కొన్నాళ్ళు సోషల్ మీడియాకు బ్రేక్ తీసుకొని నా లైఫ్ నా రూల్స్, ఎవరూ నన్ను కంట్రోల్ చేయలేరు ఇక అంటూ ఓ పోస్ట్ తో మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చింది. దీంతో అనుపమ లవ్ బ్రేకప్ నిజమే అని అంతా అనుకున్నారు.
తాజాగా అనుపమ పరమేశ్వరన్ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన లవ్ బ్రేకప్ స్టోరీ గురించి సంచలన విషయాలు తెలిపింది.
Also See : Samantha Baby Bump Photos : బేబీ బంప్ తో సమంత.. లేటెస్ట్ ఫోటోలు చూశారా..?
అనుపమ మాట్లాడుతూ.. మన పార్టనర్ పక్కన ఉంటే ప్రశాంతంగా, సురక్షితంగా భావిస్తాం. కానీ నేను నా బంధంలో ఉన్నప్పుడు ప్రతి నిమిషం భయంతో, ఆందోళనతో గడిపేదాన్ని. నేను మాములుగా చేసుకునే పనులు కూడా చూసుకునేదాన్ని కాదు. ఏం మాట్లాడాలన్నా ఆలోచించి మాట్లాడాల్సి వచ్చేది. రోజూ భయపడుతూనే ఉన్నాను. అతనే నా జీవితం అని నమ్మాను. కానీ మెల్లిమెల్లిగా అతని నిజస్వరూపం బయటపడింది. నన్ను కంట్రోల్ పెట్టేవాడు. నా సినిమా ప్రమోషన్స్ కి కూడా నన్ను వెళ్లనివ్వలేదు. డ్రాగన్ సినిమా ప్రమోషన్స్ కి అందుకే వెళ్ళలేదు.
అతని వల్ల నేను చాలా సినిమాలు వదిలేసుకున్నాను. నా ప్రతి విషయంలో జోక్యం చేసుకునేవాడు. నా సొంత కుటుంబం నుంచి కూడా అతన్ని నేను కాపాడుకున్నాను. కానీ అతను అపరిచితుడిలా ప్రవర్తించేవాడు. అతని వల్ల నేను నా స్నేహితులకు కూడా దూరమయ్యాను. ఎవరైనా నన్ను ప్రేమగా పలకరిస్తే ఏడ్చేసే పరిస్థితిలోకి వచ్చాను. అదొక టాక్సిక్ రిలేషన్ షిప్ అంటూ సంచలన కామెంట్స్ చేసింది.
Also See : Ishwarya Vullingala : ఫ్యామిలీతో నటి ఐశ్వర్య.. బోనాలు స్పెషల్ ఫొటోలు..
దీంతో అనుపమ కామెంట్స్ వైరల్ అవ్వగా ఆమె ఫ్యాన్స్ పాపం అనుపమ ఎంత బాధపడిందో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొంతమంది అతను కూడా బయటకు వచ్చి అతని వర్షన్ చెప్తాడేమో అని ఎదురుచూస్తున్నారు. అనుపమ తమిళ హీరో విక్రమ్ తనయుడు, హీరో ధృవ్ తోనే రిలేషన్ లో ఉందని వార్తలు వచ్చాయి. మరి అనుపమ చెప్పింది ధృవ్ గురించేనా లేక వేరే ఎవరైనా ఉన్నారా అనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.
