Spirit : సినిమాలు మానేసిన బాలీవుడ్ హీరోయిన్.. ప్రభాస్ స్పిరిట్ కోసం వస్తుందా?

ఈ ఇద్దరు హీరోయిన్స్ కాకుండా మరో హీరోయిన్ గెస్ట్ రోల్ కోసం కావాలంట. (Spirit)

  • Published on- July 22, 2026 / 05:36 PM IST

Spirit

Spirit : సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ స్పిరిట్ సినిమా భారీగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పోలీస్ యాక్షన్ సినిమాగా ఇది రానుంది. ఇప్పటికే 40 శాతం షూటింగ్ కూడా పూర్తయిందని సందీప్ తెలిపాడు. ఈ సినిమాలో తృప్తి దిమ్రి హీరోయిన్ గా నటిస్తుండగా ఐశ్వర్య దేశాయ్ ఓ కీలక పాత్రలో నటిస్తుంది. అయితే ఈ ఇద్దరు హీరోయిన్స్ కాకుండా మరో హీరోయిన్ గెస్ట్ రోల్ కోసం కావాలంట.

కథలో కీలకమైన ఓ పాత్రలో గెస్ట్ రోల్ కోసం ఒక హీరోయిన్ కావాల్సి రావడంతో సందీప్ రెడ్డి వంగ సినిమా హైప్ కోసం ఓ ఇద్దరు హీరోయిన్స్ ని అనుకున్నాడట. అందులో ఒకరు కత్రినా కైఫ్. ఒకప్పుడు తెలుగులో కూడా సినిమాలు చేసిన కత్రినా బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. హీరో విక్కీ కౌశల్ ని పెళ్లి చేసుకొని గత సంవత్సరం ఓ బాబుకు తల్లి కూడా అయింది.

Also Read : Gabbar Singh Ramesh : గబ్బర్ సింగ్ ఫేమ్ నటుడు రమేష్ కు బ్రెయిన్ స్ట్రోక్.. రెండు రోజుల ముందు కూడా షూటింగ్ లో..

దీంతో కత్రినా సినిమాలకు దూరంగా ఉంటుంది. 2024 లో కత్రినా చివరి సినిమా మెరి క్రిస్టమస్ వచ్చింది. ఆ తర్వాత కత్రినా సోషల్ మీడియాలో తప్ప బయట ఎక్కడా కనిపించట్లేదు. మరి సందీప్ రెడ్డి వంగ కత్రినాను ఒప్పిస్తాడా, కత్రినా స్పిరిట్ సినిమాలో చేస్తుందా? కత్రినా ఒప్పుకోకపోతే వేరే ఏ హీరోయిన్ ని తీసుకొస్తాడు అనే చర్చ నెలకొంది.

ఒక్క రెండు రోజులు కాల్షీట్స్ ఇస్తే ఆ పాత్ర షూటింగ్ పూర్తవుతుందట. మరి కత్రినా స్పిరిట్ లో నటించి మళ్ళీ తన ఫామ్ ని తెచ్చుకుంటుందా చూడాలి. కత్రినా నటిస్తే బాలీవుడ్ లో స్పిరిట్ సినిమాకు మరింత హైప్ రావడం ఖాయం.