Prabhas wishes to Vijay Deverakonda Mrunal thakur family star movie team
Prabhas : రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఈమధ్య సోషల్ మీడియాలో పోస్టులు వేస్తూ యాక్టీవ్ గా ఉంటున్నారు. అయితే ఆ పోస్టులు తనకి సంబంధించినవి కాకుండా ఇతర హీరోలు, ఇతర సినిమాలకు సంబంధించిన పోస్టులు కావడం విశేషం. ఇండస్ట్రీలోని ఇతర హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్న సమయంలో ప్రభాస్ కంగ్రాట్స్ చెబుతూ తన ఇన్‌స్టాలో పోస్టులు వేస్తున్నారు. తాజాగా ఫ్యామిలీ స్టార్ గురించి కూడా ఓ పోస్టు వేశారు.
“రేపు రిలీజ్ కాబోతున్న ఫ్యామిలీ స్టార్ మూవీ టీంకి, విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్, దిల్ రాజు గారికి నా విషెస్ తెలియజేస్తున్నాను” అంటూ ప్రభాస్ తన ఇన్‌స్టా స్టోరీలో పోస్టు వేశారు. ఇక ఈ పోస్టుకి విజయ్ దేవరకొండ రియాక్ట్ అవుతూ.. “ఐ లవ్ యు ప్రభాస్ అన్న” అంటూ పోస్టు వేశారు. ప్రస్తుతం స్టోరీలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా ఫ్యామిలీ స్టార్ సినిమా రేపు ఏప్రిల్ 5న రిలీజ్ కాబోతుంది.
Also read : Dil Raju : సీఎం జగన్ మావయ్య ఫోన్ చేసి.. సినిమా అదిరిపోయిందని చెప్పారు..
ఇక ప్రభాస్ సినిమాలు విషయానికి వస్తే.. కల్కి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ అంతా పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్నట్లు సమాచారం. మే 9న రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం ఎన్నికల వాళ్ళ పోస్టుపోన్ అవుతుందని టాక్ వినిపిస్తుంది. ఫ్యాన్స్ అంతా ఈ రిలీజ్ గురించి టెన్షన్ పడుతుంటే మూవీ టీం మాత్రం దాని పై ఎటువంటి క్లారిటీ ఇవ్వడం లేదు. ప్రభాస్ కూడా ఇలా ఇతర సినిమాల గురించి పోస్టులు వేస్తూ తన సినిమా అప్డేట్ ఇవ్వకపోవడంతో ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు.