Radhe Shyam
Radhe Shyam: పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ క్రేజీ ప్రాజెక్టులలో రాధేశ్యామ్ కూడా ఒకటి. జిల్ ఫేమ్ రాధాకృష్ణ తెరకెక్కిస్తున్న ఈ సినిమా మీద కూడా ఇండియా స్థాయిలో భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే రాధేశ్యామ్ నుండి వచ్చిన మోషన్ పోస్టర్ యూట్యూబ్ లో ఇప్పటికీ రికార్డులను తిరగరాస్తుంది. ఇది ఒకవిధంగా ప్రభాస్ మేనియాకు అద్దంపట్టేదిగా చెప్పుకుంటున్నారు.
ప్రభాస్ ప్రస్తుతం ఒకవైపు సలార్, ఆదిపురుష్ సినిమాలతో పాటు రాధేశ్యామ్ సినిమాను కూడా ఫినిష్ చేసే పనిలో ఉన్నాడు. ముంబైలో ఒకవైపు ఆదిపురుష్ షూటింగ్ చేస్తూనే పలు ప్రాంతాలలో సలార్ షూటింగ్ లో కూడా పాల్గొంటున్నాడు. ఇక ఇప్పుడు తాజాగా రాధేశ్యామ్ షూటింగ్ లో పాల్గొన్నాడు. రాధేశ్యామ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా జమ్మలమడుగు గండికోట పరిసర ప్రాంతాలలో షూటింగ్ జరుపుకుంటుంది.
శుక్రవారం నుండి మూడు రోజుల పాటు గండికోటలోనే షూటింగ్ జరగనుండగా మొదటి రోజు కోటలోని మాధవరాయ స్వామి దేవాలయం.. కోట ముఖ ద్వారం వద్ద సాంగ్ షూటింగ్ మొదలైంది. వేద పండితుల మధ్య ఈ సాంగ్ షూటింగ్ జరగగా.. ఇందులో ప్రభాస్, పూజాహెగ్డేతో పాటు మరో ముఖ్య నటుడు సత్యరాజ్ కూడా పాల్గొన్నాడు.