Prabhu Deva: 50 ఏళ్ల వయసులో తండ్రైన ఇండియన్ మైఖేల్ జాక్సన్
ఇండియన్ మైఖేల్ జాక్సన్‌గా పేరు గడించిన ప్రభుదేవా(Prabhu Deva) హీరోగా, దర్శకుడిగా, కొరియోగ్రాఫర్‌గా సత్తా చాటారు. లేటు వయసులో ఆయన మరోసారి తండ్రీ అయ్యారు.
- Thota Vamshi Kumar
- Published On : June 12, 2023 / 09:31 PM IST
Prabhu Deva
Prabhu Deva: ఇండియన్ మైఖేల్ జాక్సన్‌గా పేరు గడించిన ప్రభుదేవా(Prabhu Deva) హీరోగా, దర్శకుడిగా, కొరియోగ్రాఫర్‌గా సత్తా చాటారు. లేటు వయసులో ఆయన మరోసారి తండ్రీ అయ్యారు. ఇటీవల ఆయన భార్య హిమాని పండంటి ఆడబిడ్డకు జన్మినిచ్చినట్లు ఓ వార్త సోషల్ మీడియా చక్కర్లు కొడుతుండగా దీనిని ఆయన ధ్రువీకరించారు. అవును ఆ వార్త నిజమేనని చెప్పుకొచ్చారు. 50 ఏళ్ల వయస్సులో తాను మరోసారి తండ్రీని అయినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు.
అమ్మాయి రాకతో తన జీవితం పరిపూర్ణమైనట్లు అనిపిస్తోందన్నారు. ప్రస్తుతం తాను క్షణం తీరికలేకుండా పని చేస్తున్నానని, త్వరలోనే పనిభారాన్ని తగ్గించుకోనున్నట్లు చెప్పారు. కుటుంబంతో గడిపేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ప్రభుదేవా కుటుంబంలో తొలి పాప కావడంతో వాళ్ల సంబరం అంబరాన్ని అంటింది. కాగా.. హిమాని ఆయనకు రెండో భార్య అన్న సంగతి తెలిసిందే.
ప్రభుదేవాకు రమలతతో 1995లో వివాహం జరిగింది. వీరికి ముగ్గురు మగపిల్లలు ఉన్నారు. వీరిద్దరి మధ్య పొరపచ్చాలు రావడంతో 2011లో విడాకులు తీసుకున్నారు. కొంతకాలం క్రితం వెన్ను సమస్యతో ప్రభుదేవా బాధపడ్డారు. ఆ సమయంలో ఆయనకు ఫిజియో థెరపిస్ట్ అయిన హిమాని చికిత్స అందించారు. ఈ క్రమంలో వీరిద్దరు ప్రేమించుకున్నారు. కొంతకాలం సహజీవనం చేసిన తరువాత 2020 కరోనా సమయంలో పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికి పాప జన్మించిందని తెలిసిన అభిమానులు, నెటీజన్లు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
