Prabhudeva
Prabhudeva : ఇండియన్ మైకేల్ జాక్సన్ అనిపించుకునేలా ప్రభుదేవా తన డ్యాన్స్ తో ప్రేక్షకులను మెప్పించాడు. కేవలం డ్యాన్స్ మాస్టర్ గా మాత్రమే కాకుండా హీరోగా, నటుడుగా, డైరెక్టర్ గా, నిర్మాతగా కుడా సక్సెస్ అయ్యాడు. ఇండియాలో ఉన్న టాప్ స్టార్ హీరోలందరితో ప్రభుదేవా కలిసి పనిచేసాడు. ఇప్పుడు కూడా వరుస సినిమాలు చేస్తూ అన్ని పరిశ్రమలలో బిజీగా ఉన్నాడు.(Prabhudeva)
తాజాగా ప్రభుదేవా జగపతి బాబు హోస్ట్ చేస్తున్న జయము నిశ్చయమ్మురా షోకి రాగా పలు ఆసక్తికర విషయాలు తెలిపాడు. ఈ క్రమంలో తన లవ్ స్టోరీ గురించి తెలిపాడు.
Also See : Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ కొత్త సినిమా ‘హైలెస్సో’ మూవీ ఓపెనింగ్.. ఫొటోలు..
ప్రభుదేవా 1995లో రమాలత్ అనే మహిళను వివాహం చేసుకోగా 2011లో వీరు విడిపోయారు. ఈ జంటకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ప్రభుదేవా – నయనతార రిలేషన్ లో ఉన్నారంటూ ఆరోపణలు చేస్తూ రమాలత్ మీడియా ముందుకు కూడా వచ్చింది. కానీ తర్వాత నయనతార – ప్రభుదేవా కూడా విడిపోయారు. ఆ తర్వాత ప్రభుదేవా హిమనీ సింగ్ అనే డాక్టర్ ని 2020 లో పెళ్లి చేసుకున్నాడు.
ఈ టాక్ షోలో ప్రభుదేవా హిమనీతో ఉన్న లవ్ స్టోరీ తెలిపాడు. ప్రభుదేవా మాట్లాడుతూ.. బాలీవుడ్ లో ఓ సినిమా చేస్తున్నప్పుడు చేతికి గాయం అయింది. దీంతో ఫిజియోథెరపీ దగ్గరకు వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు హిమనీ సింగ్ అనే డాక్టర్ నాకు ట్రీట్మెంట్ చేసింది. అలా పరిచయం అయి ప్రేమలో పడ్డాము. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నాం. ఇప్పుడు పాప సియా కూడా ఉంది. ఆమె నా జీవితంలోకి వచ్చినా ఇంకా ఆ నొప్పి మాత్రం తగ్గలేదు. ఇప్పటికి తనకు చెప్తాను ఆ నొప్పికి ట్రీట్మెంట్ చేయడానికి వచ్చి నా లైఫ్ లోకి వచ్చావు కానీ ఆ నొప్పి మాత్రం ఇంకా తగ్గలేదు అంటాను అని తెలిపారు.
Also Read : OG Collections : అదరగొడుతున్న పవర్ స్టార్ OG కలెక్షన్స్.. ఫస్ట్ వీకెండ్ ఎన్ని కోట్లు..?
ప్రభుదేవా సెకండ్ వైఫ్ హిమనీ సింగ్ బయట ఎక్కడ కనపడదు. ఒక షోలో ప్రభుదేవా వెళ్లగా అక్కడ హిమనీ తన భర్త గురించి మాట్లాడిన ఓ వీడియో ప్లే చేసారు. మరోసారి తిరుమలలో కనిపించింది. ఆ తర్వాత ప్రభుదేవా భార్య హిమనీ ఎక్కడా కనిపించలేదు. సోషల్ మీడియాకు, మీడియాకు దూరంగానే ఉంటుంది. ఆమె ముంబైలో డాక్టర్ గా చేస్తుంది. ప్రభుదేవా ముంబైలో నివాసం ఉంటూనే తన వర్క్ మీద అన్ని పరిశ్రమలకు తిరుగుతున్నాడు.