‘నీలి నీలి ఆకాశమంత హిట్’.. ఎమోషనల్ అయిన యాంకర్ ప్రదీప్..

‘నీలి నీలి ఆకాశమంత హిట్’.. ఎమోషనల్ అయిన యాంకర్ ప్రదీప్..

Updated On : January 30, 2021 / 7:02 PM IST

Pradeep Machiraju: ప్రదీప్ మాచిరాజు.. బుల్లితెరపై అతని ఫాలోయింగ్ ఎలాంటిదో కొత్తగా చెప్పక్కర్లేదు.. తన పాపులారిటీతో ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా’ అనే రొమాంటిక్ కామెడీ మూవీతో హీరోగా పరిచయమయ్యాడు.. అమృతా అయ్యర్ కథానాయిక.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు మున్నా దర్శకుడిగా ఇంట్రడ్యూస్ అయ్యాడు. ఎస్వీ బాబు నిర్మించారు.

30 Rojullo Preminchadam Ela

ప్రోమోస్, ముఖ్యంగా ‘నీలి నీలి ఆకాశం’ పాట సినిమాపై అంచనాలు పెంచేశాయి.. జనవరి 29న సినిమా ప్రేక్షకుల ముందకు వచ్చింది. మూవీ యావరేజ్‌గా ఉంది.. సెకండాఫ్ 30 నిమిషాలు బాగుంది వంటి టాక్స్ వినిపించాయి కానీ.. బాక్సాఫీస్ వద్ద బొమ్మ కలెక్షన్ల కనకవర్షం కురిపిస్తోంది.

రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి మొదటిరోజు రూ. 4 కోట్ల గ్రాస్ సాధించింది. ఫస్ట్ సినిమా, అదీ ఫస్ట్ డే ఈ స్థాయి గ్రాస్ అంటే చిన్న విషయం కాదు.. ఈ సందర్భంగా ప్రదీప్ సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులు, అభిమానులకు ధన్యవాదాలు తెలుపుతూ ఓ ఎమోషనల్ లెటర్ పోస్ట్ చేశాడు.