Pramod Panju : అప్పుడు ‘సలార్’.. ఇప్పుడు ‘లెనిన్’.. ప్రీ క్లైమాక్స్ లో అఖిల్ ని డామినేట్ చేసిన ఈ నటుడు ఎవరో తెలుసా?
ఆ జాతర సీక్వెన్స్ లో ప్రమోద్ తన నటనతో అఖిల్ ని డామినేట్ చేసాడని చెప్పొచ్చు.(Pramod Panju)
- Saketh U
- Published on- July 11, 2026 / 05:44 PM IST
Pramod Panju
Pramod Panju : తాజాగా అఖిల్ లెనిన్ సినిమాతో వచ్చి మంచి హిట్ కొట్టాడు. ఈ సినిమాలో లెనిన్ ఫ్రెండ్, లెనిన్ తో పాటు కలిసి పెరిగిన వసంత్ పాత్రలో కన్నడ నటుడు ప్రమోద్ పంజు నటించాడు. సినిమాలో ఈ పాత్ర చాలా కీలకం. సెకండ్ హాఫ్ లో ఈ పాత్రతో వచ్చే ట్విస్ట్ లు అందర్నీ ఆశ్చర్యపరుస్తాయి. అంతే కాకుండా ప్రీ క్లైమాక్స్ జాతర సీన్ లో ప్రమోద్ పంజు తన నటనతో అదరగొట్టేసాడు.
అసలు ఆ జాతర సీక్వెన్స్ లో ప్రమోద్ తన నటనతో అఖిల్ ని డామినేట్ చేసాడని చెప్పొచ్చు. ఇవాళ జరిగిన లెనిన్ సక్సెస్ మీట్ లో కూడా నాగార్జున మాట్లాడుతూ.. జాతర సీన్ లో ప్రమోద్ యాక్టింగ్ చూసి అఖిల్ కి జాగ్రత్త చెప్పాను. అతనికి నీ కంటే ఎక్కువ పేరొస్తుంది అని చెప్పాను అన్నారు. నాగార్జుననే తన యాక్టింగ్ తో మెప్పించాడు ప్రమోద్. దీంతో లెనిన్ సినిమాలో వసంత్ పాత్రలో నటించిన ఈ ప్రమోద్ ఎవరు అని వెతికేస్తున్నారు.
Also Read : Sreeleela : అఖిల్ ‘లెనిన్’ సినిమా హిట్.. శ్రీలీలపై విపరీతంగా ట్రోల్స్.. కారణం ఇదే..
ప్రమోద్ పంజు కన్నడ నటుడు. కన్నడలో సీరియల్ యాక్టర్ గా కెరీర్ ప్రారంభించి పలు సీరియల్స్ లో నటించిన ప్రమోద్ ఇప్పుడు సినిమాల్లో నటిస్తున్నాడు. మొదట సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత హీరోగా కూడా మారాడు. ఓ పక్క చిన్న సినిమాల్లో హీరోగా చేస్తూనే మరో పక్క క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా నటిస్తున్నాడు. కన్నడలో రత్నన్ ప్రపంచ అనే సినిమాకు కర్ణాటక స్టేట్ బెస్ట్ సపోర్టింగ్ అవార్డు కూడా సాధించాడు ప్రమోద్.
ప్రభాస్ సలార్ సినిమాలో ప్రమోద్.. వరదరాజ మన్నార్(పృథ్వీరాజ్ సుకుమారన్)తమ్ముడు బాచి రాజమన్నార్ పాత్రలో నెగిటివ్ షేడ్స్ లో కనిపించి మెప్పించాడు. ప్రమోద్ కి సలార్ మొదటి తెలుగు సినిమా. ఇప్పుడు లెనిన్ తో మరోసారి తెలుగు ప్రేక్షకులను మెప్పించి తన నటనతో అందర్నీ తనవైపుకు తిప్పుకున్నాడు. లెనిన్ సినిమా తర్వాత ప్రమోద్ కి తెలుగులో అవకాశాలు రావడం గ్యారెంటీ. లెనిన్ తర్వాత ప్రమోద్ కి సోషల్ మీడియా ఫాలోయింగ్ పెరగడమే కాక తెలుగు ప్రేక్షకుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
