Sreeleela : అఖిల్ ‘లెనిన్’ సినిమా హిట్.. శ్రీలీలపై విపరీతంగా ట్రోల్స్.. కారణం ఇదే..
లెనిన్ హిట్ అవ్వడంతో ఇప్పుడు శ్రీలీలను ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. (Sreeleela)
Sreeleela
Sreeleela : అక్కినేని అఖిల్ తాజాగా లెనిన్ సినిమాతో వచ్చి మంచి విజయం సాధించాడు. మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది ఈ సినిమా. మొదటి రోజే లెనిన్ సినిమా 16 కోట్ల గ్రాస్ సాధించి అఖిల్ కెరీర్ హైయెస్ట్ ఓపెనింగ్స్ సాధించాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా భాగ్యశ్రీ భోర్సే కూడా అదరగొట్టింది. తన అందంతో లవ్, రొమాంటిక్ సీన్స్ లో మాత్రమే కాకుండా ఎమోషనల్ సీన్స్ లో కూడా నటనతో మెప్పించింది. అఖిల్ తో పాటు భాగ్యశ్రీ కి కూడా ఈ సినిమాకు అభినందనలు వస్తున్నాయి.
అయితే లెనిన్ హిట్ అవ్వడంతో ఇప్పుడు శ్రీలీలను ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. ఎందుకంటే మొదట లెనిన్ సినిమాలో శ్రీలీలనే హీరోయిన్ గా తీసుకున్నారు. శ్రీలీల హీరోయిన్ గా ఉన్న ఓ గ్లింప్స్ కూడా గతంలో రిలీజ్ చేసారు. ఈ గ్లింప్స్ వచ్చినప్పుడే ఆ పాత్రకు శ్రీలీల సరిపోదు అని, సీరియస్ సీన్ లో నవ్వుతుంది అని ట్రోల్ చేసారు. మరి ఆ ట్రోల్స్ ప్రభావమో, శ్రీలీల డేట్స్ సమస్యో కానీ లెనిన్ సినిమా నుంచి శ్రీలీలని తీసేసి భాగ్యశ్రీ భోర్సే ని తీసుకున్నారు.
ఈ సినిమా అంతా హీరోయిన్ పాత్ర చుట్టే తిరుగుతుంది. అలాంటి పాత్రలో భాగ్యశ్రీ అదరగొట్టేసింది. భాగ్యశ్రీ మంచి పర్ఫార్మెన్స్ చేసి ప్రేక్షకులను మెప్పించడంతో శ్రీలీలని తీసేసి మంచి పని చేశారు, శ్రీలీల ఆ పాత్రలో సరిపోయేది కాదు, ఆ పాత్రలో శ్రీలీలను ఊహించుకోవడం కష్టం అంటూ నెటిజన్లు, మీమర్స్ ట్రోల్స్ చేస్తున్నారు. దీనికి కారణం కూడా ఉంది.
శ్రీలీల ఇప్పటివరకు దాదాపు 15 సినిమాలు చేసినా అందంగా కనిపించింది, డ్యాన్సులు బాగా వేసింది, క్యూట్ గా ఉంది అని అభినందనలు వచ్చాయి కానీ ఏ సినిమాకు కూడా బాగా నటించిందని అభినందనలు రాలేదు. ఒక్క భగవంత్ కేసరి సినిమా తప్ప నటనకు అంత స్కోప్ ఉన్న పాత్ర కూడా శ్రీలీలకు పడలేదు. ఆల్మోస్ట్ అన్నీ కమర్షియల్ సినిమాల్లో కేవలం డ్యాన్స్, లవ్ సీన్స్ కే పరిమితమయ్యే పాత్రలే చేసింది. అందుకే శ్రీలీల కంటే భాగ్యశ్రీనే బాగా చేసింది, శ్రీలీలని మార్చి భాగ్యశ్రీని తీసుకొని మంచి పని చేసారు అని అంటున్నారు. టాలీవుడ్ జనాలు కూడా ఇదే అనుకుంటున్నారు. సినిమా చూసిన ప్రేక్షకులు కూడా శ్రీలీల బదులు భాగ్యశ్రీనే బాగా చేసింది, శ్రీలీల సెట్ అవ్వదు అని చెప్తున్నారు. మరి శ్రీలీల ఇకపై అయినా నటనకు స్కోప్ ఉన్న పాత్రలు ఎంచుకొని తానేంటో నిరూపించుకుంటుందా చూడాలి. ఈ ట్రోల్స్ పై శ్రీలీల ఏమైనా స్పందిస్తుందా చూడాలి.
