The Red Bag Teaser : ‘ది రెడ్ బ్యాగ్’ టీజర్ రిలీజ్.. నలుగురు అమ్మాయిలు ఒక బ్యాగ్..

మీరు కూడా ది రెడ్ బ్యాగ్ టీజర్ చూసేయండి.. (The Red Bag Teaser)

  • Published on- June 23, 2026 / 06:44 PM IST

The Red Bag Teaser

The Red Bag Teaser : మెమరీ మేకర్స్ బ్యానర్ పై హరికృష్ణ సోమిశెట్టి నిర్మాణంలో రవి కుమార్ సీరపు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ది రెడ్ బ్యాగ్’. కబీర్ సింగ్, ప్రసాద్ బెహరా, రాధ్య, మోనిక, స్నేహా సింగ్, ఆకాంక్ష, ఈషాన్ శంకర్, అవినాష్ బాదల్, భార్గవి, రాశీ.. పలువురు కీలక పాత్రల్లో ఈ సినిమా తెరకెక్కుతుంది. తాజాగా ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ ను నిర్వహించి టీజర్ రిలీజ్ చేసారు. ‘ది రెడ్ బ్యాగ్’ టీజర్‌ను ఏపీ ఇండస్ట్రీస్, కామర్స్, ఫుడ్ ప్రాసెసింగ్ మినిస్టర్ టీజీ భరత్ రిలీజ్ చేశారు.

మీరు కూడా ది రెడ్ బ్యాగ్ టీజర్ చూసేయండి..

Also Read : Ram Charan : పీఎం మోదీతో రామ్ చరణ్ – ఉపాసన.. ఫొటోలు వైరల్..

టీజర్ లాంచ్ ఈవెంట్లో మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ.. టీజర్ బాగుంది. మా కర్నూలు నుంచి వచ్చిన హరి గారు తీసిన ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి. మా రెడ్ బుక్ గురించి ఇండియా వ్యాప్తంగా తెలుసు. అలానే ఈ ది రెడ్ బ్యాగ్ మూవీ కూడా ఇండియా అంతా సౌండ్ చేయాలి. కర్నూలులోనే షూటింగ్ చేశారు కానీ ఫారిన్‌లో తీసినట్టుగా కనిపిస్తోంది అని అన్నారు.

సీనియర్ దర్శకుడు నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. ఇలాంటి వినూత్న చిత్రాలు విజయవంతం అవ్వాలి. హరి గారు ఈ సినిమా హిట్ అయితే మరిన్ని సినిమాల్ని నిర్మిస్తారు. టీజర్ చూసి నేను షాక్ అయ్యాను. నెక్ట్స్ లెవెల్లో సినిమా ఉండబోతోందని తెలుస్తుంది అన్నారు. దర్శకుడు రవి కుమార్ సీరపు మాట్లాడుతూ.. ఈ సినిమా లైఫ్ టైం ఇంపాక్ట్ చూపిస్తుంది. ఈ మూవీ చూసిన తరువాత ఎక్కడ రెడ్ బ్యాగ్‌ని చూసినా మా సినిమా గుర్తొస్తుంది. పదహారేళ్ల నిరీక్షణ తరువాత దర్శకుడిగా అవకాశం వచ్చింది. మా సినిమాకి కథే హీరో అని అన్నారు.

Also Read : Vishnupriya : వామ్మో.. కేవలం దాంతోనే నెలకు 30 లక్షలు సంపాదిస్తున్న విష్ణుప్రియ..

నిర్మాత హరికృష్ణ సోమిశెట్టి మాట్లాడుతూ.. మూవీ చాలా బాగా వచ్చింది. టీజర్ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. త్వరలోనే మూవీ రిలీజ్ కాబోతోంది అని అన్నారు. హీరోయిన్ రాధ్య మాట్లాడుతూ.. మేం అందరం కలిసి ఎంతో కష్టపడి సినిమాని పూర్తి చేశాం అని అన్నారు. నటుడు ప్రసాద్ బెహరా మాట్లాడుతూ.. ఈ సినిమాలో నాది, కబీర్ సింగ్ ట్రాక్ బాగుంటుంది. ఓ బ్యాగ్ చుట్టూ తిరిగే కథ మాత్రమే కాదు భావోద్వేగాలతో కూడిన కథ కూడా అని తెలిపారు.