‘బీ ద రియల్ మేన్’ ఛాలెంజ్‌లో అదరగొట్టిన చిరంజీవికి పీవీపీ విజ్ఞప్తి..
‘బీ ద రియల్ మేన్’ ఛాలెంజ్ టాలీవుడ్‌లో బాగా పాపులర్ అయింది. సందీప్ రెడ్డి వంగా నుంచి ప్రారంభమైన ఈ ఛాలెంజ్ ఇప్పుడు కోలీవుడ్, బాలీవుడ్ వరకు వెళుతుంది. ఇంట్లోని మహిళలతో ఇంటి పనులు చేయించకండి అంటూ ‘అర్జున్ రెడ్డి’ డైరెక్టర్ సందీప్ వంగా మగవారికి ‘బీ ద రియల్ మేన్’ అనే ఛాలెంజ్ విసిరగా.. ఈ ఛాలెంజ్ ఇప్పుడు సెలబ్రిటీలందరూ స్వీకరిస్తూ.. ఇంటిపనులు చేస్తున్న వీడియోలను పోస్ట్ చేస్తున్నారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇచ్చిన ఈ ఛాలెంజ్‌ను మెగాస్టార్ చిరంజీవి తన స్టైల్లో చేసి చూపించారు. ఇంట్లోని పనులు చేస్తున్న వీడియోని పోస్ట్ చేసిన చిరంజీవి ఈ ఛాలెంజ్‌కు కేటీఆర్, రజినీకాంత్, మణిరత్నం వంటి దిగ్గజాలను నామినేట్ చేశారు. ఈ వీడియోలో చిరు దోశ వేసిన తీరు సింప్లీ సూపర్బ్ అనే చెప్పాలి. ఇప్పుడీ వీడియోపై నిర్మాత పీవీపీ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు.
‘‘చిరంజీవి గారు, ఏదో ఇంట్లో అంట్లు తోమగలము, గచ్చు కడగగలము కానీ మీరిలా స్టార్ చెఫ్ లా నలభీమ పాకము వండుతుంటే, మా ఆవిడ మెగాస్టారే చేయగలేనిది, మీకేమిటి అంటున్నారు.. మా సంసారంలో నిప్పులు పోయొద్దు రియల్ లైఫ్ మెగాస్టార్‌గారు.. జోక్స్ పక్కన పెడితే.. మీ నిరంతర ప్రేరణ ప్రశంసనీయం సర్’’ అంటూ పీవీపీ చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది.
చిరంజీవి గారు,ఏదో ఇంట్లో అంట్లు తోమగలము,గచ్చు కడగగలము కానీ మీరిలా స్టార్ చెఫ్ లా నలభీమ పాకము వండుతుంటే, మా ఆవిడ మెగాస్టారే చేయగలేనిది, మీకేమిటి అంటున్నారు..మా సంసారంలో నిప్పులు పోయొద్దు రియల్ లైఫ్ మెగాస్టార్ గారు ??
Jokes apart, your continued inspiration is admirable Sir? https://t.co/92jM1sfApr— PVP (@PrasadVPotluri) April 23, 2020