Anantha Movie Review : ‘అనంత’ సినిమా రివ్యూ.. 15 వేల ఏళ్ళ నుంచి బతికున్న మనిషి కథతో..

మనిషి ఆయుష్షు నేపథ్యంలో సాగే కథ ఇది. డిఫరెంట్ స్టోరీ లైన్ తీసుకొని గతంలో ఎప్పుడూ చూడని కోణంలో కథను తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేశాడు డైరెక్టర్‌.

Prashanth Karthi Anantha Movie Review and story plot

Anantha Movie Review :  గతంలో ‘ధృవ’, ‘చెక్‌’.. లాంటి పలు సినిమాలతో పాటు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన కొండా చిత్రంలో నక్సలైట్ నాయకుడు RK రోల్ పోషించి ఆకట్టుకున్న ప్రశాంత్ కార్తీ తాజాగా అనంత అనే సినిమాతో మరో డిఫరెంట్ క్యారెక్టర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మధు బాబు దర్శకత్వంలో A ప్రశాంత్ నిర్మాతగా తెరకెక్కిన అనంత సినిమా నేడు జూన్ 9న థియేటర్స్ లో రిలీజయింది. ఈ చిత్రంలో ప్రశాంత్ కార్తీ సరసన రిత్తిక చక్రవర్తి హీరోయిన్ గా నటించింది. ఘంటసాల విశ్వనాధ్ సంగీతం అందించారు.

అనంత కథేంటంటే.. రదేశ్(ప్రశాంత్‌ కార్తి) ఒక ప్రొఫెసర్‌. ప్రతి పదేళ్లకు ఒక్కసారి అతను పని చేసే యూనివర్సీటీ నుంచి వెళ్లిపోతుంటాడు. అలా ప్రస్తుతం అతను పని చేసే యూనివర్సీటీ నుంచి వెళ్తున్న క్రమంలో అతనికి వీడ్కోలు చెప్పడానికి వచ్చిన సైంటిస్ట్‌లు ప్రద్యుమ్న( అనీష్ కురువెళ్ళ), ధర్మా(గెడ్డం శ్రీనివాస్), శృతీ(రిత్తిక చక్రవర్తి) తదితరులు రదేశ్‌ ఇంటికి వస్తారు. అసలు ఈ యూనివర్సీటీ నుంచి ఎందుకు వెళ్తున్నావని రదేశ్‌ని ప్రశ్నించడంలో అసలు కథ ప్రారంభం అవుతుంది. రదేశ్‌ 15 వేల సంవత్సరాల క్రితం పుట్టిన వ్యక్తి. అతనికి మరణం ఉండదు, వయసు పెరగదు. అతని వయసు గుర్తించేలోపు ఆ ప్రదేశం నుంచి వెళ్లి పోతుంటాడు. ఇదంతా ఆ సైంటిస్టులకు వివరిస్తాడు రదేశ్‌. దీంతో అక్కడ్నుంచి కథ ఆసక్తిగా మారుతుంది. అసలు రదేశ్‌ ఎవరు? నిజంగానే అతను 15 వేల సంవత్సరాల క్రితం పుట్టాడా? దీనివెనుక ఉన్న కథనం ఏంటి తెలియాలంటే అనంత సినిమా చూడాల్సిందే.

మనిషి ఆయుష్షు నేపథ్యంలో సాగే కథ ఇది. డిఫరెంట్ స్టోరీ లైన్ తీసుకొని గతంలో ఎప్పుడూ చూడని కోణంలో కథను తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేశాడు డైరెక్టర్‌ మధుబాల. స్టార్ ట్రెక్ రచయిత జెరోం బిక్స్బీ రాసిన కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రొఫెసర్‌కి వీడ్కోలు చెప్పడానికి వచ్చిన అతని సహచరులు తెలుసుకున్న కొన్నిఆసక్తికర విషయాలు మాటల్లో కాకుండా విజువల్స్‌గా తెరపై చూపించి ఉంటే మరింత ఆసక్తికరంగా ఉండేవి. ఫస్టాఫ్‌ మొత్తం సైంటిస్టులు ప్రశ్నలు అడగడం, ప్రొఫెసర్‌ జవాబు చెప్పడం ఇలానే సాగుతుంది. ఆ తర్వాత ఆసక్తి రేపే కొన్ని అంశాలతో సెకండాఫ్‌ సాగుతుంది. ఇక క్లైమాక్స్‌ ట్విస్ట్‌ మాత్రం అదిరిపోతుంది.

NTR – Ram Charan : ఎన్టీఆర్ అండ్ చరణ్ తో కలిసి నటించడం అదృష్టం అంటున్న థోర్..

గతంలో రామ్ గోపాల్ వర్మ రూపొందించిన కొండా చిత్రంలో నక్సలైట్ నాయకుడు ఆర్కే రోల్ పోషించి ఆకట్టుకున్న ప్రశాంత్ కార్తీ ఈ సినిమాతో మరో డిఫరెంట్ క్యారెక్టర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రొఫెసర్‌ రదేశ్ పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. డాక్టర్‌ ప్రద్యుమ్న పాత్ర లో అనీష్ కురువెళ్ళ, ధర్మా గా గెడ్డం శ్రీనివాస్ లు తమ సహజ నటనతో ప్రేక్షకులను అలరించారు. శృతిగా రిత్తిక చక్రవర్తి తన పాత్రకు న్యాయం చేసింది. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఘంటశాల విశ్వనాథ్ సంగీతం ఈ సినిమాకు ప్లస్‌. మంచి నేపథ్య సంగీతాన్ని అందించారు. పాటలు ఫర్లేదనిపించాయి.