Prashanth Neel : కుటుంబసభ్యుల పేరులతో పాటు ‘సలార్’ పేరుని కూడా.. ప్రశాంత్ నీల్ వీడియో వైరల్..
ప్రశాంత్ నీల్ కి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. కుటుంబసభ్యుల పేరులతో పాటు 'సలార్' పేరుని కూడా..
- gum 95921
- Published On : September 7, 2023 / 02:51 PM IST
Prashanth Neel love on Prabhas Salaar movie video viral
Prashanth Neel : సౌత్ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కేజీఎఫ్ (KGF) చిత్రాలతో ఇండియన్ స్టార్ డైరెక్టర్స్ లిస్ట్ లో స్థానం దక్కించుకున్నాడు. ప్రస్తుతం ఈ దర్శకుడు ప్రభాస్ (Prabhas) తో సలార్ (Salaar) సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ఈ నెల 28న రిలీజ్ కావాల్సి ఉంది. కానీ మూవీకి సంబంధించిన పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో రిలీజ్ వాయిదా పడింది. చిత్ర యూనిట్ నుంచి క్లారిటీ రానప్పటికీ ఆ తేదీలో మరో సినిమాలు వచ్చి చేరడంతో పోస్ట్‌పోన్ కన్ఫార్మ్ అయ్యింది.
Mahesh – Pawan : అప్పుడు పవన్ కోసం మహేష్.. ఇప్పుడు మహేష్ కోసం పవన్.. నిజమేనా..?
కాగా ప్రశాంత్ నీల్ ఫ్యామిలీ ఆంధ్రప్రదేశ్ లోని ‘నీలకంఠాపురం’ విలేజ్ కి చెందిన వారు అని తెలిసిందే. అతని నాన్న గారి సమాధి ఆ గ్రామంలోనే ఉండడంతో అప్పుడప్పుడు అక్కడికి వచ్చి వెళ్తుంటాడు. తాజాగా కృష్ణాష్టమి సందర్భంగా ప్రశాంత్ నీల్ ఆ గ్రామాన్ని సందర్శించాడు. అక్కడ గుడిలో పూజలు నిర్వహించిన ప్రశాంత్ నీల్.. అనంతరం తన తండ్రి సమాధిని సందర్శించాడు. ఇక గుడిలో పూజలు నిర్వహిస్తున్న సమయంలో.. దేవుడి పూజలో తన కుటుంబసభ్యుల పేరులతో పాటు సలార్ మూవీ పేరుని కూడా చెప్పి ప్రత్యేకంగా పూజ చేయించాడు.
Pushpa 2 : పుష్ప 2 సెట్స్ నుంచి వీడియో లీక్.. బాబోయ్ ఎన్ని లారీలు..
ఇక ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజెన్స్.. ‘ప్రశాంత్ నీల్ తన కుటుంబంతో పాటు సలార్ పై కూడా అంతే ప్రేమని చూపిస్తున్నాడు. దీన్నిబట్టే అర్ధమవుతుంది తను మూవీని ఎంత ప్రేమగా తెరకెక్కిస్తున్నాడో’ అని కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఈ మూవీ పోస్ట్‌పోన్ అండ్ కొత్త విడుదల తేదీ పై మూవీ టీం నుంచి క్లారిటీ కోసం అందరూ వేచి చూస్తున్నారు. దీపావళి కానుకగా ఈ మూవీ వచ్చే అవకాశం ఉంది అంటూ ఫిలిం వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.
#PrashantNeel Visited Neelakantapuram Temple.#SalaarCeaseFire #Prabhas pic.twitter.com/JCRcfH6j9o
— 10Tv News (@10TvTeluguNews) September 7, 2023
