Prayag Raj : సినీ పరిశ్రమలో మరో విషాదం.. ఎన్నో సూపర్ హిట్స్ ఇచ్చిన స్టార్ రైటర్ కన్నుమూత..

బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు గత 50 ఏళ్లుగా రచయితగా ఉన్న సీనియర్ స్టార్ రైటర్ ప్రయాగ్ రాజ్ మరణించారు.

Prayag Raj Bollywood Star Writer passed away with health issues Bollywood pay tributes

Prayag Raj : ఇటీవల సినీ పరిశ్రమలో పలువురు ప్రముఖులు మరణించి వరుస విషాదాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా బాలీవుడ్(Bollywood) సినీ పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు గత 50 ఏళ్లుగా రచయితగా ఉన్న సీనియర్ స్టార్ రైటర్ ప్రయాగ్ రాజ్ మరణించారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో సినీ పరిశ్రమకు దూరంగా ఉంటున్న ప్రయాగ్ రాజ్ ఆదివారం నాడు ఉదయం మరణించారు.

ప్రయాగ్ రాజ్ మరణించిన విషయం ఆయన కుటుంబ సభ్యులు మీడియాకు తెలియచేశారు. 88 ఏళ్ళ వయసులో ఆయన అనారోగ్య, వయోభారం సమస్యలతో మరణించారు. నిన్న ఆదివారం సాయంత్రమే అంత్యక్రియలు కూడా నిర్వహించేశారు. దీంతో పలువురు బాలీవుడ్ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ప్రయాగ్ రాజ్ కి నివాళులు అర్పిస్తున్నారు.

Also Read : Bigg Boss 7 Day 21 : మళ్ళీ లేడీ కంటెస్టెంట్‌నే ఎలిమినేటి చేసిన బిగ్‌బాస్.. ఆదివారం స్పెషల్ స్కంద రామ్..

ప్రయాగ్ రాజ్ రచయితగా ఎన్నో సూపర్ హిట్ బాలీవుడ్ సినిమాలకు పనిచేసారు. దాదాపు 100 సినిమాలకు పైగా కథా రచయితగా, మాటల రచయితగా పనిచేశారు. అమితాబ్ బచ్చన్ సూపర్ హిట్ సినిమా కూలీకి రచయితగా డైరెక్టర్ గా కూడా చేశారు. అమర్ అక్బర్ అంథోని, మార్డ్, గెరాప్తర్, చోర్ సిఫాయి, మర్డ్.. లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు పని చేసారు. చివరగా 2021 లో జమానాథ్ సినిమాకి కూడా కథ అందించారు. 80, 90 దశకాల్లో అప్పటి స్టార్ హీరోలందరితో కలిసి పనిచేశారు ప్రయాగ్ రాజ్.