బ్రిటన్‌కు చెందిన మోడల్, నటి అమీ జాక్సన్ దక్షిణ భారతదేశ సినీ పరిశ్రమల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఎవడు, ఐ తర్వాత శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘2.0’లో వంటి చిత్రాలతో ప్రేక్షకులని అలరించిన అమీ జాక్సన్ ఈ సంవత్సరం బ్రిటన్ మదర్స్ డే రోజు తాను తల్లిని కాబోతున్నానని ప్రకటించి షాక్ ఇచ్చారు. తాను గర్భంతో ఉన్న ఫొటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు.
అయితే రీసెంట్‌గా అమీ, మల్టీ మిలియనీర్ జార్జ్ పనాయిటౌతో లండన్‌లో ఎంగేజ్‌మెంట్ వేడుక జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి స్నేహితులు, బంధువులు, హాజరయ్యారు. వేడుకలో అమీ, జార్జ్ కలిసి డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
తన ఎంగేజ్‌మెంట్‌కి సంబంధించిన నా ఎంగేజ్‌మెంట్ స్వీట్ మెమొరీస్ అంటూ కొన్ని ఫోటోలని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. రెండేళ్లుగా డేటింగ్‌లో ఉన్న ఈ జంట 2020లో పెళ్లి పీటలు ఎక్కనున్నారు. సినిమాల విషయానికి వస్తే అమీ నటించిన కిక్ 2 మూవీ విడుదలకు సిద్ధమవుతున్నది.