Preity Zinta : కాంగ్రెస్ పార్టీ పెట్టిన పోస్ట్ కి కౌంటర్ ఇచ్చిన ప్రీతీ జింతా.. తప్పుడు వార్తలను ప్రమోట్ చేస్తున్నారు అంటూ..

గత రెండు రోజులుగా ప్రీతీ జింతా వార్తల్లో నిలుస్తుంది.

Preity Zinta slammed the Kerala unit of the Congress for a social media post

Preity Zinta : తెలుగు, హిందీ సినిమాలలో ఒకప్పుడు హీరోయిన్ గా సినిమాలు చేసినా నటి ప్రీతీ జింతా ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంది. పలు బిజినెస్ లతో బిజీగా ఉంది. ఐపీఎల్ లో పంజాబ్ టీమ్ కి కూడా ఈమె ఓనర్. గత రెండు రోజులుగా ప్రీతీ జింతా వార్తల్లో నిలుస్తుంది.

ప్రీతీ జింతాకు చెందిన 18 కోట్ల రుణాలను బ్యాంక్ మాఫీ చేసిందని వార్తలు వచ్చాయి. న్యూ ఇండియా కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ కొంతమంది రుణాలను మాఫీ చేసిందని, అందులో ప్రీతీ జింతా పేరు మీద ఉన్న రూ.18 కోట్ల రుణాన్ని మాఫీ చేసిందని వార్తలు వచ్చాయి. దీంతో ప్రీతీ జింతా న్యాయబృందం ఇప్పటికే ఒక ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటనలో.. 12 సంవత్సరాల క్రితం, నాకు న్యూ ఇండియా కోఆపరేటివ్ బ్యాంక్‌తో ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యం ఉంది. 10 సంవత్సరాల క్రితం, నేను ఈ ఓవర్‌డ్రాఫ్ట్ సదుపాయానికి సంబంధించి మొత్తం బకాయిలను పూర్తిగా తిరిగి చెల్లించి ఖాతా మూసివేసాను అని తెలిపింది.

Also Read : NTR – Devara : జపాన్ లో ‘దేవర’ రిలీజ్.. ప్రమోషన్స్ కోసం మళ్ళీ జపాన్ వెళ్తున్న ఎన్టీఆర్.. ఫొటో వైరల్..

అయితే తాజాగా కేరళ కాంగ్రెస్ సోషల్ మీడియాలో.. ప్రీతీ జింతా తన సోషల్ మీడియా ఖాతాలను బిజెపికి ఇచ్చింది. అందుకు 18 కోట్ల రుణాలను రద్దు చేసారు. దీనివల్ల బ్యాంక్ కుప్పకూలింది. డిపాజిటర్లు తమ డబ్బు కోసం వీధిన పడుతున్నారు అని పోస్ట్ చేసింది. దీంతో ప్రీతీ జింతా డైరెక్ట్ గానే దీనిపై స్పందించింది.

కేరళ కాంగ్రెస్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ కి ప్రీతీ జింతా సమాధానమిస్తూ.. నేను నా సోషల్ మీడియా అకౌంట్స్ నా స్వంతంగా చూసుకుంటాను. ఇలాంటి తప్పుడు వార్తలను ప్రమోట్ చేయడం మీకు అవమానం. ఎవరూ నా రుణాన్ని రుణమాఫీ చేయలేదు. ఒక పొలిటికల్ పార్టీ నా పేరు, ఫొటో వాడుతూ తప్పుడు వార్తలను ప్రచారం చేయడం నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. తీసుకున్న రుణం 10 ఏళ్ళ క్రితమే పూర్తిగా తిరిగి చెల్లించబడింది. భవిష్యత్తులో ఎలాంటి అపార్థాలు ఉండకుండా ఈ క్లారిటీ సహాయపడుతుందని ఆశిస్తున్నాను అంటూ పోస్ట్ చేసింది. దీంతో ఆమె అభిమానులు, నెటిజన్లు కేరళ కాంగ్రెస్ ని విమర్శిస్తున్నారు.

Also Read : Parugu Movie : అల్లు అర్జున్ ‘పరుగు’ సినిమాకు అసలు అనుకున్న టైటిల్ ఏంటో తెలుసా? ఆ టైటిల్ తో వచ్చిన సినిమాలు ఫ్లాప్..