Parugu Movie : అల్లు అర్జున్ ‘పరుగు’ సినిమాకు అసలు అనుకున్న టైటిల్ ఏంటో తెలుసా? ఆ టైటిల్ తో వచ్చిన సినిమాలు ఫ్లాప్..
ప్రతి సినిమాకు ముందు చాలానే టైటిల్స్ అనుకుంటారు. అలాగే పరుగు సినిమాకు కూడా పలు టైటిల్స్ అనుకున్నారు.

Do You Know Allu Arjun Parugu Movie Before Title
Parugu Movie : అల్లు అర్జున్ కెరీర్లో హిట్ సినిమాల్లో ‘పరుగు’ ఒకటి. బొమ్మరిల్లు లాంటి సూపర్ హిట్ సినిమా తీసిన తర్వాత దర్శకుడు భాస్కర్ పరుగు సినిమా తీసాడు. అల్లు అర్జున్, షీలా జంటగా పరుగు సినిమా తెరకెక్కింది. 2008 మే 1న సమ్మర్లో రిలీజయిన పరుగు సినిమా మంచి హిట్ అయి ఆల్మోస్ట్ 30 కోట్ల పైగా గ్రాస్ వసూలు చేసింది.
అయితే ప్రతి సినిమాకు ముందు చాలానే టైటిల్స్ అనుకుంటారు. అలాగే పరుగు సినిమాకు కూడా పలు టైటిల్స్ అనుకున్నారు. ప్రేమికుడు, ఎంతఘాటు ప్రేమయో, అరకు అనే టైటిల్స్ మొదట్లో అనుకున్నారు. కానీ ఇవన్నీ సెట్ అవ్వలేదని చివరకు ‘వారధి’ అనే టైటిల్ అనుకున్నారు. ఆ టైటిల్ రిజిస్టర్ చేయించి అదే టైటిల్ తో షూటింగ్ కి వెళ్లారు. అయితే సినిమాలో కథ, హీరో క్యారెక్టర్, కొన్ని డైలాగ్స్ వల్ల ఆ సినిమాకు వారధి కంటే పరుగు టైటిల్ బాగుంటుందని భావించి సినిమా షూటింగ్ అయ్యే సమయానికి పరుగు టైటిల్ ని ఫైనల్ చేసారు.
పరుగు టైటిల్ తో ఈ సినిమా హిట్ కొట్టి అల్లు అర్జున్ కి మరో హిట్ ని ఇచ్చింది. ఈ సినిమాలో సాంగ్స్ కూడా బాగుంటాయి. లేచిపోయిన కూతురుని వెతకడానికి తండ్రి పడే కష్టం, బాధతో పాటు అదే తండ్రి ఇంకో కూతుర్ని హీరో లవ్ చేస్తే ఎలా రియాక్ట్ అయ్యారు అని మంచి లవ్ అండ్ ఎమోషనల్ గా ఈ సినిమాని తెరకెక్కించారు. అయితే వారధి అనే టైటిల్ తో తర్వాత రెండు సినిమాలు వచ్చాయి. రెండు చిన్న సినిమాలే. ఒకటి హీరోయిన్ ఆనంది నటించిన సినిమా. మరొకటి కొత్తవాళ్లతో తెరకెక్కించిన సినిమా. వారధి టైటిల్ పెట్టుకున్న ఈ రెండు సినిమాలు ఫ్లాప్ గానే నిలిచాయి.
Also See : Tripti Dimri : త్రిప్తి దిమ్రి బర్త్ డే సెలబ్రేషన్స్ ఫోటోలు.. ఫ్రెండ్స్ తో కలిసి వెకేషన్ కు..
ఇక అల్లు అర్జున్ ఇప్పుడు ఐకాన్ స్టార్ గా పాన్ ఇండియా ఫేమ్ తెచ్చుకున్నాడు. పుష్ప సినిమాతో పాన్ ఇండియాకు పరిచయం అయి పుష్ప 2 సినిమాతో బాహుబలి సినిమా రికార్డులు కూడా బద్దలు కొట్టి ఇండియా వైడ్ స్టార్ డమ్ తో టాప్ పొజిషన్ లో ఉన్నాడు. త్వరలో త్రివిక్రమ్ తో సినిమా చేయనున్నాడు. ఇక పరుగు సినిమా డైరెక్టర్ భాస్కర్ ప్రస్తుతం సిద్ధూ జొన్నలగడ్డతో జాక్ సినిమా తీస్తున్నాడు.