NTR – Devara : జపాన్ లో ‘దేవర’ రిలీజ్.. ప్రమోషన్స్ కోసం మళ్ళీ జపాన్ వెళ్తున్న ఎన్టీఆర్.. ఫొటో వైరల్..

ఇప్పుడు ఎన్టీఆర్ దేవర సినిమా జపాన్ లో రిలీజవ్వనుంది.

NTR – Devara : జపాన్ లో ‘దేవర’ రిలీజ్.. ప్రమోషన్స్ కోసం మళ్ళీ జపాన్ వెళ్తున్న ఎన్టీఆర్.. ఫొటో వైరల్..

NTR Ready to Promotions for Devara Japan Release

Updated On : February 25, 2025 / 12:34 PM IST

NTR – Devara : మన తెలుగు సినిమాలకు ముఖ్యంగా ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్ సినిమాలకు జపాన్ లో మంచి మార్కెట్ ఉన్న సంగతి తెలిసిందే. మన తెలుగు సినిమాలకు, హీరోలకు జపాన్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మన సినిమాలని అక్కడ గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. దీంతో మన స్టార్ హీరోలు వాళ్ళ సినిమాలను జపాన్ లో కూడా రిలీజ్ చేసి అక్కడ కూడా ప్రమోషన్స్ చేస్తున్నారు.

Also Read : Parugu Movie : అల్లు అర్జున్ ‘పరుగు’ సినిమాకు అసలు అనుకున్న టైటిల్ ఏంటో తెలుసా? ఆ టైటిల్ తో వచ్చిన సినిమాలు ఫ్లాప్..

ఇప్పుడు ఎన్టీఆర్ దేవర సినిమా జపాన్ లో రిలీజవ్వనుంది. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా తెరకెక్కిన దేవర సినిమా గత సంవత్సరం రిలీజయి మంచి విజయం సాధించింది. 500 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని సాధించింది. ఇప్పుడు దేవర సినిమా జపాన్ లో మార్చ్ 28న రిలీజ్ కానుంది. దీని కోసం ఎన్టీఆర్ స్వయంగా ప్రమోషన్స్ కి రంగంలోకి దిగారు.

NTR Ready to Promotions for Devara Japan Release

ప్రస్తుతం ఎన్టీఆర్ జపాన్ మీడియాకు ఆన్లైన్ లో ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. దానికి సంబంధించిన ఫొటో ఎన్టీఆర్ టీమ్ షేర్ చేసింది. దీంతో ఈ ఫొటో వైరల్ గా మారింది. ఇక దేవర ప్రమోషన్స్ కోసం ఎన్టీఆర్ మార్చ్ 22న జపాన్ వెళ్లనున్నారు. గతంలో ఎన్టీఆర్ RRR ప్రమోషన్స్ కి, తర్వాత ప్రైవేట్ వెకేషన్ కి జపాన్ వెళ్లారు. ఇప్పుడు మరోసారి ఎన్టీఆర్ దేవర ప్రమోషన్స్ కోసం జపాన్ వెళ్లనున్నారు. దీంతో అక్కడి ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి దేవర సినిమా జపాన్ లో ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి.

Also See : Tripti Dimri : త్రిప్తి దిమ్రి బర్త్ డే సెలబ్రేషన్స్ ఫోటోలు.. ఫ్రెండ్స్ తో కలిసి వెకేషన్ కు..