Premalo : ‘ప్రేమలో’ ట్రైలర్ రిలీజ్.. సినిమా రిలీజ్ ఎప్పుడంటే?

చందు కోడూరి హీరోగా, దర్శకుడిగా తెరకెక్కించిన సినిమా 'ప్రేమలో'.

Premalo Movie Trailer Released Movie Releasing date Announced

Premalo Trailer : చందు కోడూరి హీరోగా, దర్శకుడిగా తెరకెక్కించిన సినిమా ‘ప్రేమలో’. చరిష్మా శ్రీఖర్ హీరోయిన్ గా నటించగా డ్రీమ్ జోన్ పిక్చర్స్ బ్యానర్ లో రాజేష్ కోడూరి నిర్మించారు. ఇప్పటికే టీజర్, పలు సాంగ్స్ రిలీజ్ అవ్వగా తాజాగా నేడు ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి నటుడు శివాజీ రాజా గెస్ట్ గా వచ్చారు.

ప్రేమలో ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. ఇక ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరో, దర్శకుడు చందు కోడూరి మాట్లాడుతూ.. నాకు సినిమా ఇండస్ట్రీలో సరైన గుర్తింపు రాకపోయినా ఇక్కడే ఉండటం నాకు ఆనందం. ప్రేమలో సినిమాతో నేను హీరోగా, దర్శకుడిగా రాబోతోన్నాను. సినిమా ట్రైలర్ శివాజీ రాజా గారు రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది. ఆయన ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్ర చేశారు. సినిమా కోసం టీం అంతా చాలా కష్టపడింది. మేజర్, రైటర్ పద్మభూషన్ లాంటి హిట్ సినిమాలు చేసిన ఎడిటర్ పవన్ కళ్యాణ్ నా కోసం ఈ సినిమా చేసినందుకు థ్యాంక్స్. సినిమా BGM నెక్స్ట్ లెవల్ లో ఉంటుంది. నిర్మాతగా మా అన్నయ్య రాజేష్ డబ్బు పెట్టడమే కాకుండా, మేనేజర్‌లా కష్టపడ్డారు. భారీ క్యాస్ట్, ఎలివేషన్స్ లేకపోయినా భారీ ఎమోషన్స్ ఉన్నాయి. కథలో బలం, కాన్సెప్ట్‌లో దమ్ముంది. అందుకే ఈ సినిమాను చేశాను. ఇప్పటివరకు ఎవ్వరూ ట్రై చేయని కథను చేశాను. ఈ సినిమాతో ఎంతో మందికి ఉపాధిని కల్పించాను. సినిమా పెద్ద హిట్ అయితే చాలా మందికి ఉపాధి కల్పిస్తాను అని అన్నారు.

Also Read : Ayodhya Ram Mandir : అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం పై టాలీవుడ్ సెలబ్రిటీస్ ట్వీట్స్..

నటుడు శివాజీ రాజా మాట్లాడుతూ.. మొదట ఈవెంట్‌కు యాంకర్ లేరని చెప్పడం బాధగా అనిపించింది. తమిళ్ స్టార్ టీ రాజేందర్.. ఆయనే హీరో, ఎడిటర్, దర్శకుడు. కానీ ఆయన యాంకరింగ్ ఎప్పుడూ చేయలేదు. ఇప్పుడు చందు యాంకరింగ్ కూడా చేశాడు. మా గురువు వి.మధు సూధన్ గారి అమ్మాయి వాణి ఫోన్ చేసి ఈ టీంకి హెల్ప్ చేయమని అడిగారు. మూడు రోజుల క్యారెక్టర్ అడిగారు. చందు ప్యాషన్ చూసి.. మూడ్రోజులు ఉంటే ఖర్చు ఎక్కువ అవుతుందని ఒకటిన్నర రోజులోనే కంప్లీట్ చేయమన్నాను. అతను పడ్డ కష్టానికి మంచి పేరు వస్తుంది. ఇలాంటి చిన్న చిత్రాలను ఆదరించాలి అన్నారు. ఇక ఈ సినిమా రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26 థియేటర్స్ లో రిలీజ్ కానుంది.