తిప్పరామీసం-ఫస్ట్ లుక్

శ్రీ విష్ణు కొత్త సినిమా తిప్పరామీసం.

  • Publish Date - February 6, 2019 / 05:38 AM IST

శ్రీ విష్ణు కొత్త సినిమా తిప్పరామీసం.

హిట్టు, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా, డిఫరెంట్ క్యారెక్టర్స్ చూజ్ చేసుకుంటూ.. నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు శ్రీ విష్ణు. వీరభోగ వసంతరాయలు తర్వాత అతను నటిస్తున్న కొత్త సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ రీసెంట్‌గా రిలీజ్ అయ్యాయి. రిజ్వాన్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై, రిజ్వాన్ నిర్మాణంలో, అసుర ఫేమ్ కృష్ణ విజయ్ డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ సినిమాకి తిప్పరామీసం అనే టైటిల్ ఫిక్స్ చేసారు. టైటిల్ ఫన్నీ అండ్ క్యాచీగా ఉంది. ఫస్ట్ లుక్‌లో శ్రీ విష్ణు, కళ్ళద్దాలు, గుబురు గెడ్డం, మీసాలతో కనిపిస్తున్నాడు.

ఒకవైపు అద్దం సగం పగిలిఉంది. నిక్కీ థంబోలి హీరోయిన్‌గా చేస్తుంది. తిప్పరామీసం ప్రస్తుతం రెగ్గులర్ షూటింగ్ జరుపుకుంటుంది. సమర్పణ : శ్రీఓమ్ సినిమా, కెవిఎల్‌పి ప్రొడక్షన్, సంగీతం : సురేష్ బొబ్బిలి, కో-ప్రొడ్యూసర్స్ : ఖుషి, అచ్యుత్ రామారావు.  

వాచ్ ఫస్ట్ లుక్…