Mahesh Babu Holiday trip to US : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్యామిలీతో సరదాగా హాలీడే ట్రిప్ ప్లాన్ చేశారు. కరోనా నిబంధనలు, జాగ్రత్తలు పాటిస్తూనే తన కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్తున్నారు.
మహేశ్ తన కొడుకు గౌతమ్, కుమార్తె సితారతో కలిసి ఉన్న ఫొటో ఒకటి సోషల్ మీడియా వైరల్ అవుతోంది.
ఆ ఫొటోలో మహేశ్ సహా అందరూ మాస్క్ లు ధరించి ఎయిర్ పోర్టులో ఇలా కనిపించారు.
తన పిల్లలతో కలిసి దిగిన సెల్ఫీ ఫొటోను ప్రిన్స్ మహేశ్ తన ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. సూపర్ స్టార్ ఫ్యామిలీ అమెరికాకు విహారయాత్రకు వెళ్తున్నట్టు సమాచారం.
కరోనా వ్యాప్తితో విధించిన లాక్‌డౌన్ సమయంలో ప్రిన్స్ ఫ్యామిలీ బయటకు వెళ్లలేదు. 8 నెలలుగా ఇంటికే పరిమితమయ్యారు. త్వరలోనే “సర్కారు వారి పాట” సినిమా షూటింగ్ కూడా ప్రారంభం కానుంది.
ఈలోగా కొన్నిరోజులు పిల్లలతో కలిసి ఎంజాయ్ చేయాలనుకున్నారేమో ఇలా హాలీడే ట్రిప్ ప్లాన్ చేశారు.
ఈ ట్రిప్ ముగియగానే మూవీ షూటింగ్ లో పాల్గొననున్నారు. “సర్కారు వారి పాట” మూవీలో మహేశ్ సరసన నటి కీర్తి సురేశ్ నటిస్తున్నారు. దర్శకుడు పరశురామ్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.