Demonte Colony 2 : ‘డీమాంటీ కాలనీ 2’ మూవీ రివ్యూ.. ఈ హారర్ సీక్వెల్ భయపెట్టిందా?

ఇటీవల పూర్తిస్థాయి హారర్ సినిమాలు సరిగ్గా రావట్లేదు. అలాంటో లోటుని ఈ డీమాంటీ కాలనీ 2 కచ్చితంగా తీరుస్తుంది.

Priya Bhavani Shankar Demonte Colony 2 Movie Review and Rating

Demonte Colony 2 Movie Review : 2015 లో రిలీజయిన హారర్ సినిమా డీమాంటీ కాలనీ సినిమా తమిళ్ తెలుగు ప్రేక్షకులని భయపెట్టి మంచి విజయం సాధించింది. ఇప్పుడు దానికి సీక్వెల్ గా డీమాంటీ కాలనీ 2 వచ్చింది.
ఆల్రెడీ తమిళ్ లో ఆగస్టు 15న రిలీజయి సూపర్ హిట్ అయిన హారర్ థ్రిల్లర్ సినిమా డీమాంటీ కాలనీ 2 ఇప్పుడు తెలుగులో రిలీజయింది. డీమాంటీ కాలనీ 2 సినిమా నేడు ఆగస్టు 23న తెలుగులో థియేట్రికల్ రిలీజ్ అయింది. అరుల్ నిధి, ప్రియ భవానీ శంకర్ జంటగా, అన్తి జాస్కేలైనెన్, సెరింగ్ డోర్జీ, అరుణ్ పాండియన్.. పలువురు ముఖ్య పాత్రల్లో అజయ్ ఆర్ జ్ఞానముత్తు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కగా తెలుగులో ఈ సినిమాని శ్రీ బాలాజీ ఫిలింస్ బ్యానర్ పై ఎన్ శ్రీనివాస రెడ్డి సమర్పణలో బి.సురేష్ రెడ్డి, బి.మానస రెడ్డి రిలీజ్ చేసారు.

కథ విషయానికొస్తే.. కొన్నేళ్ల క్రితం సూసైడ్ చేసుకొని మరణించిన భర్త సామ్(సర్జనో కాలిద్) ఎలా చనిపోయాడో కనుక్కోవాలని డెబీ(ప్రియా భవాని శంకర్) ప్రయత్నిస్తుండగా అతని ఆత్మతో మాట్లాడే ప్రయత్నంలో ఒక లైబ్రరీలో ఒక పుస్తకం చదవడం వల్లే అతను మరణించాడని తెలుస్తుంది. అంతేకాకుండా ఆ పుస్తకం ఆరేళ్లకొకసారి కొంతమందిని చంపుతుందని తెలుస్తుంది. అప్పుడు కూడా శ్రీనివాస్(అరుళ్ నిధి), రఘునందన్(అరుళ్ నిధి) కవలలు ఆ పుస్తకాన్ని చదివి మరణించబోతున్నారని డెబీకి తెలుస్తుంది. దీంతో వాళ్ళని కాపాడటానికి రిచర్డ్(అరుణ్ పాండియన్)తో కలిసి డెబీ ప్రయత్నిస్తుంది. అదే సమయంలోకి డీమాంటీ కాలనీలోకి వేరే అమ్మాయిలు ఎలా వచ్చారు? టిబెట్ నుంచి వచ్చిన బౌద్ధ సన్యాసులు వీరిని కాపాడగలిగారా? డెబీ ఆ ఇద్దర్ని కాపాడిందా? డీమాంటీ కాలనీ వీళ్ళను ఎంతవరకు భయపెట్టింది తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

Also Read : Maruthi Nagar Subramanyam : ‘మారుతీ నగర్ సుబ్రమణ్యం’ మూవీ రివ్యూ.. ఫుల్‌గా పడీ పడీ నవ్వుకోవాల్సిందే..

సినిమా విశ్లేషణ.. డీమాంటీ కాలనీ మొదటి భాగాన్ని చూసిన వాళ్ళకి ఈ సినిమా బాగా అర్ధమవుతుంది. ఫస్ట్ పార్ట్ చూడకుండా పార్ట్ 2కి వెళ్తే కాస్త కన్ఫ్యూజ్ అయినా మెల్లిగా కథలోకి వెళ్తారు. సాధారణంగా హారర్ సినిమాల్లో చాలా వరకు ఆత్మలతోనే పోరాటం ఉంటుంది. ఇందులో కూడా అంతే. ఫస్ట్ పార్ట్ భర్త ఆత్మహత్య, భార్య ఆ ఆత్మతో మాట్లాడటం, డీమాంటీ కాలనీ గురించి తెలియడం అంటూ ఆసక్తిగా సాగుతుంది. సెకండ్ హాఫ్ కి అందరూ డీమాంటీ కాలనీకి రావడం, అక్కడ జరిగే సంఘటనలు ప్రేక్షకులని భయపెడతాయి. అంతేకాకుండా సినిమాలో ట్విస్టులు కూడా ఇచ్చి సర్ ప్రైజ్ చేసారు.

హారర్ అనుభవం ప్రేక్షకులకు ఇవ్వడంలో ఏ మాత్రం తగ్గలేదు. ఇటీవల పూర్తిస్థాయి హారర్ సినిమాలు సరిగ్గా రావట్లేదు. అలాంటి లోటుని ఈ డీమాంటీ కాలనీ 2 కచ్చితంగా తీరుస్తుంది. మొదటిసారి ఇండియన్ హారర్ సినిమాలో బుద్ధిజం స్పిరిచువాలిటీని చాలా బాగా చూపించారు. హారర్ తో పాటు సినిమాలో మంచి ఎమోషన్ కూడా ఉంది. థియేటర్ లో హారర్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న సినిమా చూడాలంటే డీమాంటీ కాలనీ 2కి వెళ్లాల్సిందే. చివర్లో పార్ట్ 3కి లీడ్ ఇవ్వడం గమనార్హం.

నటీనటుల పర్ఫార్మెన్స్.. అరుళ్ నిధి కవలలుగా రెండు పాత్రల్లో వేరియేషన్స్ చూపిస్తూ బాగా నటించాడు. ప్రియా భవాని శంకర్ మరోసారి తన నటనతో మెప్పించింది. అరుణ్ పాండియన్ కూడా మెప్పిస్తాడు. ముఖ్యంగా బౌద్ధ గురువు, బౌద్ధ భిక్షవులు బాగా నటించారు. మిగిలిన నటీనటులు కూడా పర్వాలేదనిపించారు.

సాంకేతిక అంశాలు.. హారర్ సినిమాలకు సినిమాటోగ్రఫీ చాలా ముఖ్యం. డీమాంటీ కాలనీ 2లో ఆ విషయంలో సక్సెస్ అయ్యారు. సినిమాటోగ్రఫీ విజువల్స్ డార్క్ బ్యాక్ డ్రాప్ తో చాలా బాగున్నాయి. ఇక హారర్ అనుభవం రావాలంటే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తోనే భయపెట్టాలి. ఈ సినిమాలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ థియేటర్లో ప్రేక్షకుడిని ఫుల్ గానే భయపెట్టారు. విజువల్ ఎఫెక్ట్స్ మీద ఇంకొంచెం శ్రద్ద పెట్టాల్సింది. కథ పరంగా పాతదే అనిపించినా కొత్త కథనంతో హారర్ థ్రిల్లర్ గా మెప్పించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ఈ సినిమాని దర్శకుడే నిర్మించడంతో నిర్మాణ పరంగా కూడా ఎక్కడ ఎంత ఖర్చుపెట్టాలో అంతే ఖర్చుపెట్టారు.

మొత్తంగా ‘డీమాంటీ కాలనీ 2’ సినిమా ఫస్ట్ పార్ట్ ని మించి ప్రేక్షకులని భయపెట్టడంలో సక్సెస్ అయిందని చెప్పొచ్చు. ఈ సినిమాకు రేటింగ్ 3 ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

ట్రెండింగ్ వార్తలు