మళ్లీ కన్నుకొట్టింది : కుర్రాళ్ల మనసులు కొల్లగొట్టింది

‘ఒరు అదార్ లవ్’తో గుర్తింపు తెచ్చుకున్న ప్రియా ప్రకాష్ వారియర్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఓ వీడియోను షేర్ చేసింది..

  • Publish Date - October 31, 2019 / 10:27 AM IST

‘ఒరు అదార్ లవ్’తో గుర్తింపు తెచ్చుకున్న ప్రియా ప్రకాష్ వారియర్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఓ వీడియోను షేర్ చేసింది..

కొంటెగా కన్నుగీటి కుర్రకారుని మైకంలో ముంచేసింది మలయాళీ ముద్దుగుమ్మ.. ప్రియా ప్రకాష్ వారియర్.. తన ఎక్స్‌ప్రెషన్స్‌తో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసిన ప్రియాకు సంబంధించి మరో వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ‘ఒరు అదార్ లవ్’ తో గుర్తింపు తెచ్చుకున్న ప్రియా ప్రకాష్ వారియర్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఓ వీడియోను షేర్ చేసింది. 

గతంలో కన్నుకొట్టి కుర్రకారు మనసులు కొల్లగొట్టిన ప్రియా ఈ వీడియోలోనూ అదే స్థాయిలో అలరించేలా కనిపిస్తోంది. ప్రియా ‘విష్ణుప్రియ’ అనే సినిమాతో కన్నడ పరిశ్రమకు పరిచయమవుతుంది. శ్రేయాస్ మంజు హీరోగా నటిస్తుండగా, వీకే ప్రకాష్ డైరెక్ట్ చేస్తున్నాడు.. గోపి సుందర్ సంగీతమందిస్తున్నాడు.

Read Also : రాగల 24 గంటల్లో : నవంబర్ 15 విడుదల

ప్రియాకు బర్త్‌డే విషెస్ చెబుతూ మూవీ టీమ్ రిలీజ్ చేసిన వీడియోను ప్రియా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ వీడియోలో వర్షంలో తడుస్తూ తన స్టైల్‌లో  కన్ను కొడుతూ కనిపిస్తోంది ప్రియా.. వచ్చే ఏడాది ‘విష్ణుప్రియ’ మూవీ రిలీజ్ కానుంది.