Priyamani : తన పెళ్లి గురించి వస్తున్న పుకార్లపై స్పందించిన ప్రియమణి..

తన భర్త ముస్తఫా రాజ్ గురించి అతని మొదటి భార్య అయేషా చేసిన ఆరోపణల గురించి ప్రియమణి స్పందించింది..

Priyamani

Priyamani: తన భర్త ముస్తఫా రాజ్ గురించి అతని మొదటి భార్య అయేషా చేసిన ఆరోపణల గురించి ప్రియమణి స్పందించింది. ముస్తఫా ఇప్పటికే తన భర్తేనని, ప్రియమణితో అతని పెళ్లి చెల్లదని, ఆమెను మ్యారేజ్ చేసుకోవడానికి ముందు మేం విడాకుల కోసం కూడా అప్లై చేసుకోలేదని అంటుంది. కాబట్టి ప్రియమణితో ముస్తఫా పెళ్లి అక్రమమే అంటూ అయేషా ఆరోపణలు చేసింది.

Priyamani Husband : ప్రియమణితో నా భర్త పెళ్లి అక్రమం.. మొదటి భార్య అయేషా ఆరోపణలు..

ఆమె ఆరోపణలు, తమ పెళ్లి విషయంలో వస్తున్న వార్తలపై ప్రియమణి స్పందిస్తూ.. తమది చట్టబద్ధమైన సంబంధమేనని, ముస్తఫా లాంటి భర్త దొరకడం అదృష్టమని, ప్రస్తుతం ఆయన విదేశాల్లో ఉన్నారు. కాస్త తీరిక దొరికినా చాలు, ఇద్దరం ఫోన్లో మాట్లాడుకుంటామని చెప్పుకొచ్చింది.

 

‘వివాహ బంధంలో అండర్‌స్టాండింగ్ అండ్ కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను, ముస్తఫా చాలా అన్యోన్యంగా ఉంటాం. తను ఇప్పుడు అమెరికాలో ఉన్నారు. ప్రొఫెషన్ పరంగా ఇద్దరం ఎంత బిజీగా ఉన్నప్పటికీ రోజూ ఫోన్లో మాట్లాడుకుంటాం. ఒకవేళ కుదరకపోతే కనీసం హాయ్, బాయ్ వంటివి అయినా చెప్పుకుంటాం. ఫ్రీ ఉంటే చాట్ చేసుకుంటాం. మా రిలేషన్ మీద డౌట్స్ ఎక్స్‌ప్రెస్ చేసేవారికి చెప్పేది ఒక్కటే. మా మధ్య ఎలాంటి గొడవలు లేవు. చాలా ప్రేమగా ఉన్నాం. ఏ విషయాన్నైనా కలిసి షేర్ చేసుకుంటాం. వైవాహిక జీవితంలో ఇది చాలా ఇంపార్టెంట్’ అని చెప్పుకొచ్చింది ప్రియమణి.