Priyanka Jawalkar
Priyanka Jawalkar : పవన్ కళ్యాణ్ సినిమాలో జస్ట్ అలా కనిపిస్తే చాలు అని ఎంతోమంది హీరోయిన్లు అనుకుంటారు. కానీ ప్రియాంక జవల్కార్ మాత్రం ఆ ఛాన్స్ వస్తే నో చెబుతాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. షార్ట్ ఫిలిమ్స్ తో కెరీర్ మొదలు పెట్టిన ఈ భామ.. ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండ సినిమాలో నటించి గుర్తింపు సంపాదించుకుంది. టాక్సీవాలా సినిమాలో విజయ్ పక్కన ఆకట్టుకున్న ప్రియాంక ఆ తరువాత తిమ్మరుసు, ఎస్ ఆర్ కల్యాణమండపం సినిమాల్లో నటించి అలరించింది.
Priyanka Jawalkar : పాల పిట్ట వలపుల ప్రియాంక..
ఇక విషయానికి వస్తే.. ఈ భామ పవన్ కళ్యాణ్ కి వీరాభిమానిని అంటూ చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చింది. తాజాగా మరోసారి పవన్ పై తన అభిమానాన్ని వెల్లడించింది. ‘పవన్ కళ్యాణ్ గారి తమ్ముడు సినిమాని దాదాపు 20 సార్లు పైగా చూశాను. ఇక ఖుషి సినిమా అయితే చెప్పనక్కర్లేదు. ఆ మూవీ లోని ప్రతి డైలాగ్ నేను అలవోకగా చెప్పేస్తాను. అంత స్టార్‌డమ్ ఉన్నా ఆర్డినరీ మ్యాన్ లా, చాలా సింపుల్ గా ఎలా ఉంటారో నాకు అసలు అర్ధం కాదు’ అంటూ వెల్లడించింది.
ఒకవేళ పవన్ తో సినిమా చేసే ఛాన్స్ వస్తే చేస్తారా అన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘జీవితాంతం ఆయనని చూస్తూ అభిమానిగా ఉంటాను. అంతే గాని అయన పక్కన మాత్రం నటించను, నటించలేను. ఆయన అభిమానిగా ఉంటే చాలు ఈ జీవితానికి’ అంటూ వెల్లడించింది. కాగా ఇటీవల ఈ భామ బాలకృష్ణ సినిమా కోసం ఎంపిక చేసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. అనిల్ రావిపూడి, బాలకృష్ణ కలయికలో వస్తున్న సినిమాలో ప్రియాంకని పరిశీలిస్తున్నట్లు గుసగుసలు వినిపించాయి. మరి ఈ వార్తల్లో నిజమెంత ఉంది అనేది తెలియదు.