Priyanka Nalkar : అబ్బాయిల పైన నమ్మకం లేదు.. పెళ్లి చేసుకోను.. సూ*సైడ్ థాట్స్.. ప్రియాంక కామెంట్స్..

తాజాగా ప్రియాంక ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎమోషనల్ అయింది.(Priyanka Nalkar)

  • Published on- June 6, 2026 / 10:25 PM IST

Priyanka Nalkar

Priyanka Nalkar : పలు టీవీ షోలు, సీరియల్స్, సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది ప్రియాంక. తెలుగు అమ్మాయి అయినా తమిళ్ సీరియల్స్ లో నటించి అక్కడ కూడా స్టార్ డమ్ తెచ్చుకుంది. తాజాగా ప్రియాంక ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎమోషనల్ అయింది.

Also Read : Anchor Suma : వడ్డే నవీన్ సినిమాలో యాంకర్ సుమ.. అది కూడా ప్రగ్నెంట్ గా ఉన్నప్పుడు..

ప్రియాంక మాట్లాడుతూ.. నాకు ఇప్పుడు అబ్బాయిల పైన నమ్మకం లేదు. నాకు ఒకటి జరిగింది. అందుకే పెళ్లి చేసుకోను. మా ఇంట్లో వాళ్ళతోనే ఉండిపోతాను. లవ్ మీద కూడా నాకు ఇప్పుడు ఏ ఒపీనియన్ లేదు. అతను నటిస్తున్నాడని తెలిసి కూడా అతనితోనే ఉన్నాను. చివరకు నేనే హర్ట్ అయ్యాను. నన్ను హర్ట్ చేసినవాళ్లు ఆల్రెడీ కర్మకు బాధ్యలు అయ్యారు. ఫేస్ చేసారు వాళ్ళు.

నాకు సూసైడ్ థాట్స్ కూడా వచ్చాయి కానీ పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళను చూసుకోవాలి అని ఆగిపోయా. నాకు చిన్నప్పట్నుంచి పెళ్లి గ్రాండ్ గా చేసుకోవాలి, ఒక క్యూట్ ఫ్యామిలీ ఉండాలి, పిల్లలు ఉండాలి అని ఉండేది. కానీ ఇప్పుడు అది లేదు. మా ఇంట్లో ఇప్పుడు నేనే సంపాదిస్తున్నాను. మా ఫ్యామిలీని చూసుకోవాలి. మా పెద్ద చెల్లి పెళ్లి నేనే చేశాను. చిన్న చెల్లి పెళ్లి చేయాలి. ఒకవేళ నా లైఫ్ లోకి ఎవరైనా అబ్బాయి వస్తే నా వర్క్ సపోర్ట్ చేయాలి. మా పేరెంట్స్ కి నేను సపోర్ట్ ఉంటా. అందుకు ఒప్పుకోవాలి. ఆడపిల్లల్ని రెస్పెక్ట్ చేయాలి అని చెప్తూ ఎమోషనల్ అయింది.