Bigg Boss 5: అడిగి మరీ ప్రపోజ్ చేయించుకున్న పింకీ.. అలకబూనిన సిరి
బిగ్ బాస్ ఇంట్లో ఆరవ వారం కూడా చివరికి వచ్చేసింది. కెప్టెన్సీ టాస్కులతో పాటు బిగ్ బాస్ ఆడించే గేమ్స్ తో ఇంట్లో ఒకరి మీద ఒకరు అరుపులు, కేకలే కాదు.. క్యూట్ అలకలు.. అంతకు మించి..
- Naresh Mannam
- Published On : October 16, 2021 / 07:33 AM IST
Big Boss 5
Big Boss 5: బిగ్ బాస్ ఇంట్లో ఆరవ వారం కూడా చివరికి వచ్చేసింది. కెప్టెన్సీ టాస్కులతో పాటు బిగ్ బాస్ ఆడించే గేమ్స్ తో ఇంట్లో ఒకరి మీద ఒకరు అరుపులు, కేకలే కాదు.. క్యూట్ అలకలు.. అంతకు మించి రొమాంటిక్ ప్రపోజల్స్ కూడా కనిపించడంతో ప్రేక్షకులకు ఈ వారం కాస్త బెటర్ ఎంటర్ టైన్మెంట్ దొరుకుతుంది. ప్రతి వారం మాదిరే ఈ వారం కూడా వరస్ట్ పర్ఫార్మర్ ఇంటిలో చిచ్చు పెట్టింది. ఈ వారం వరస్ట్ పర్ఫామర్‌ను ఎన్నుకొనేందుకు.. ఎవరిని జైలుకు పంపాలనుకుంటున్నారో వారి టీ షర్ట్ మీద స్టాంప్ వేయాల్సి ఉంటుందని బిగ్ బాస్ ఆదేశించాడు.
Big Boss 5: అర్ధరాత్రి మానస్ దుప్పట్లో పింకీ.. బీబీ హౌస్‌లో మూడుముక్కలాట!
కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్‌లో మొదటగా విశ్వ.. రవి మీద స్టాంప్ వేయగా.. ప్రియాంక, ప్రియ, షణ్ముఖ్, లోబో శ్వేతను వరస్ట్ పర్ఫామర్‌గా ఎన్నుకున్నారు. సన్నీ, మానస్.. సిరిని; శ్రీరామ్, సిరి.. యానీ మాస్టర్‌ను వరస్ట్ పర్ఫామర్ అని చెప్పారు. లోబోను వరస్ట్ పర్ఫామర్‌గా యానీ ఎంచుకోగా.. శ్వేత, జెస్సీ కూడా లోబోనే వరస్ట్ అని అభిప్రాయపడ్డారు. జెస్సీ ఈ వారం కనపడలేదంటూ మరోసారి అతడిని వరస్ట్ పర్ఫామర్‌గా ఎన్నుకున్నాడు రవి. మెజారిటీ ఓట్లు శ్వేతకు పడటంతో ఆమెను జైలుకు పంపించారు.
Big Boss 5: ఈ వారం నామినేషన్‌లో పదిమంది.. ఎలిమినేట్ అయ్యేది ఎవరో?
ఇక, వరస్ట్ పర్ఫార్మర్ టాస్క్ అనంతరం వాడు నన్ను అలా మోసం చేస్తాడని ఊహించనేలదని శ్వేతా, కాజల్ ఏడవడం యానీ ఓదార్చడం ఇలా ఓదార్పు యాత్ర సాగగా యానీ తనకే రిలేషన్ వద్దని చెప్పిన మాటకి శ్వేతా ఏడవడం.. మా అమ్మ బ్రతికుంటే బాగుండని సింపతీకి ప్రయత్నించడం జరిగింది. ఇక అంతకు ముందే క్యారెక్టర్ లేనిదానితో ఫ్రెండ్‌షిప్ చేయడం ఎందుకని అలకబూనింది సిరి. నిన్ను ఉడికిద్దామనే షణ్ను అలా అన్నాడు, అంతేనంటూ ఆమెను బుజ్జగించే ప్రయత్నం చేశాడు జెస్సీ. ఇంతలో ప్రియాంక వచ్చి నాకు ప్రపోజ్ చేయాల్సివస్తే ఎలా చేస్తావని జెస్సీని అడిగింది.
Big Boss 5: ఫాఫం.. ఉన్న ఒక్క జంటను విడగొట్టేశారే!
అతడు నిర్మొహమాటంగా నేను చెయ్యను అని తేల్చి చెప్పాడు. ఒకవేళ చెయ్యాల్సి వస్తే సచ్చిపోతాడు.. కానీ చెయ్యడు అని కౌంటరిచ్చాడు షణ్ను. దీంతో రూటు మార్చిన పింకీ.. తనను సిరి అనుకుని ప్రపోజ్ చేయమంది. చేస్తే సిరికే చేస్తానంటూ పంచ్ ఇచ్చాడు జెస్సీ. ఇది విన్న షణ్ను.. ఆమె నీకు ఏ యాంగిల్‌లో నచ్చిందిరా అంటూ జోకేయడంతో సిరి ఏడ్చేసింది. అసలే అప్పటికే అలకమీదున్న సిరిని షణ్ను అలా ఏం నచ్చిందని టీజ్ చేయడంతో మరికాస్త బెట్టుచేసింది. అలా అలా శుక్రవారం ముగియగా ఇక ఇప్పుడు వారాంతంలో ఏం జరుగుతుందో ఈ వారం ఎలిమినేషన్ ఎవరన్నది ఉత్కంఠగా మారింది.
