Producer Bellamkonda Suresh Interesting Comments about Samantha goes Viral
Samantha – Bellamkonda Suresh : సమంత ఇటీవల మయోసైటిస్ అనే ఆరోగ్య సమస్యతో బాధపడి ఇప్పుడిప్పుడే పూర్తిగా కోలుకుంటున్న సంగతి తెలిసిందే. కొన్నాళ్ళు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సమంత ఇటీవలే సిటాడెల్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే సమంత గతంలో కూడా ఓ ఆరోగ్య సమస్యతో బాధపడింది, అప్పుడు నేనే తనకు డబ్బు సహాయం చేశాను అని ఓ నిర్మాత కామెంట్స్ చేసారు.
ఒకప్పటి స్టార్ నిర్మాత, హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తండ్రి బెల్లంకొండ సురేష్ గతంలో ఎన్నో హిట్ సినిమాలు తీసి గత కొన్నాళ్లుగా సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. ఆల్మోస్ట్ 9 ఏళ్ళ తర్వాత మళ్ళీ నిర్మాతగా సినిమాలు తీయబోతున్నారు. ఈ సందర్భంగా బెల్లంకొండ సురేష్ పలు యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఓ ఇంటర్వ్యూలో ఈయన సమంత గురించి మాట్లాడారు.
Also Read : Pushpa 3 : పుష్ప 3 కచ్చితంగా తీయాల్సిందే.. పుష్ప 3 కథేంటి? ఇంకో కొత్త విలన్? ఆల్రెడీ కొంత షూటింగ్ పూర్తి..
బెల్లంకొండ శ్రీనివాస్ మొదటి సినిమా అల్లుడు శీనులో సమంత హీరోయిన్ గా నటించింది. ఆ సినిమాకు నిర్మాత బెల్లంకొండ సురేష్. ఆ సమయంలో జరిగిన విషయం గురించి చెప్తూ.. అల్లుడు శీను సమయంలో కూడా సమంతకు ఓ ఆరోగ్య సమస్య వచ్చింది. అది చర్మ సమస్యకు సంబంధించింది. తన ఆరోగ్య సమస్య నుంచి కోలుకోడానికి సమంతకు డబ్బులు అవసరం అయ్యాయి. కొంతమంది నిర్మాతలకు ఫోన్స్ చేసి అడిగినా ఎవ్వరూ ఇవ్వలేదు. అప్పుడు నేనే ఆమెకు 25 లక్షలు ఇచ్చాను. ఆమె బయట ఉంటే ఇబ్బంది అని సినిమా అయ్యేదాకా స్టార్ హోటల్ లో రూమ్ బుక్ చేసి అక్కడ ఉంచాను. ఓ నాలుగు నెలల్లో సమంత ఆ చర్మ సమస్య నుంచి కోలుకుంది. నేను చేసిన సహాయం సమంత ఎప్పటికి మర్చిపోదు. ఇప్పటికి సమంత మా కుటుంబ సభ్యురాలే అని తెలిపారు బెల్లంకొండ సురేష్. దీంతో ఈ నిర్మాత చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.