Toxic : ‘పెద్దవాళ్లకు’ మాత్రమే.. టాక్సిక్ సినిమాపై క్లారిటీ ఇచ్చిన నిర్మాత..

తాజాగా ఈ సినిమా నిర్మాత వెంకట్ కె నారాయణ జన నాయగన్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో దీనిపై స్పందించాడు.(Toxic)

  • Published on- July 24, 2026 / 07:23 PM IST

Toxic

Toxic : కెజిఎఫ్ తర్వాత చాలా గ్యాప్ తో యశ్ నుంచి రాబోతున్న ‘టాక్సిక్’ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. ఈ సినిమా ఆగస్టు 26న రిలీజ్ కానుంది. అయితే ఇప్పటివరకు ఈ సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్, సాంగ్స్ తో ఈ సినిమా అడల్ట్ సినిమా, గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ సినిమా, కచ్చితంగా A సర్టిఫికెట్ సినిమా అని అంతా అనుకుంటున్నారు. ఇటీవల వచ్చిన సాంగ్స్ తో అసలు ఏం సినిమా చేస్తున్నారు అని విమర్శలు కూడా వస్తున్నాయి.

తాజాగా ఈ సినిమా నిర్మాత వెంకట్ కె నారాయణ జన నాయగన్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో దీనిపై స్పందించాడు.

Also Read : Nara Brahmani : నాన్నకు శస్త్రచికిత్స పూర్తయింది.. బాలయ్య ఆరోగ్యంపై బ్రాహ్మణి అప్డేట్..

వెంకట్ కె నారాయణ మాట్లాడుతూ.. మేం టైటిల్‌లోనే చెప్పాం ఈ సినిమా పేరు టాక్సిక్ అని. ఈ సినిమా పెద్దవాళ్లకు మాత్రమే. ఇది ఆ ఏజ్ గ్రూప్‌ వాళ్ల సినిమానే. ఇప్పటివరకు వచ్చిన కంటెంట్ చూస్తే ఆ విషయం ఎవరికైనా అర్థమైపోతుంది. ఈ విషయంలో మేం చాలా క్లియర్‌గా ఉన్నాం. మొదటి టీజర్‌లో క్రియేటివిటీ, రెండో టీజర్‌లో సినిమా స్థాయి, మూడో టీజర్‌లో లేడీ పాత్రలను పరిచయం చేసాము. టోటల్ సినిమా థీమ్ ఏంటి అనేది ట్రైలర్ లో చూపిస్తాం అని తెలిపారు.

దీంతో నిర్మాతే స్వయంగా ఇది పెద్దవాళ్ళ సినిమా అని చెప్పడంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందో అని అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇటీవల యశ్ ఓ బాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ.. 1947లో స్వతంత్రం వచ్చినా మన ఇండియాలో ఇంకా కొన్ని ప్రాంతాలు 1961 వరకు పోర్చ్ గ్రీస్, ఫ్రాన్స్ వాళ్ళ ఆధీనంలోనే ఉన్నాయి. ఆ సమయంలో జరిగిన ఓ బిజినెస్ కి సంబంధించిన కథ ఇది. ఆ ప్రాంతాల్లో అధికారం కోసం జరిగే గ్యాంగ్ స్టర్ కథ ఇది. ఇందులో బ్రదర్ సిస్టర్ సెంటిమెంట్, తండ్రి కొడుకు రివెంజ్ కథ. ఓ మంచి లవ్ స్టోరీ కూడా ఉంది అని తెలిపాడు.