Producer Naga Vamsi stunning counter to trollers
Naga Vamsi: ఈమధ్య కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి బాగా పాపులర్ అయిన నిర్మాత ఎవరైనా ఉన్నారు అంటే అది నాగ వంశీ అనే చెప్పాలి. త సినిమాలను ఎలా ప్రమోట్ చేసుకోవాలో ఈ నిర్మాతకు బాగా తెలుసు. అలా తన టైపు ఆఫ్ స్పీచ్ లతో నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాడు. కానీ, ఈ మధ్య కాలంలో చాలా ట్రోల్ అవుతున్న నిర్మాత కూడా ఆయనే అవడం విశేషం. దానికి కారణం ఆయన బ్యానర్ నుంచి వస్తున్న సినిమాలు పెద్దగా ఆడియన్స్ ని అలరించడం లేదు. దాంతో, నెటిజన్స్ నాగ వంశీపైన కావాలని టార్గెట్ చేసి మరీ కామెంట్స్ చేస్తున్నారు. అయితే, ఈ కామెంట్స్ కి తాజాగా తన రేంజ్ లో కౌంటర్ ఇచ్చాడు ఈ యంగ్ నిర్మాత.
నాగ వంశీ(Naga Vamsi) బ్యానర్ నుంచి వస్తున్న లేటెస్ట్ మూవీ ఎపిక్. 90’స్ బయోపిక్ వెబ్ సిరీస్ కి ఇది సీక్వెల్ గా తెరకెక్కుతున్న సినిమా. బేబీ మూవీ జంట ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య ఈ సినిమాలో జంటగా నటిస్తున్నారు. దర్శకుడు ఆదిత్య హాసన్ ఈ సినిమాను యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించినట్టుగా తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. అనంతరం మీడియాతో ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో చాలా విషయాల గురించి మాట్లాడారు మూవీ.ఇక నిర్మాత నాగ వంశీ మాట్లాడుతూ తనపై వచ్చిన ట్రోలింగ్ కూడా ఆయన స్టయిల్లో అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు.
“ఈ ఏడాది మా బ్యానర్ నుంచి కొన్ని ఫ్లాప్స్ వచ్చాయి. దానికి కొంతమంది నన్ను బాగా టార్గెట్ చేశారు. వచ్చే ఏడాది ఫస్ట్ హాఫ్ లోనే మా బ్యానర్ నుండి నెలకు ఒక సినిమా రిలీజ్ అవుతున్నాయి. అన్ని కూడా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్స్ అవుతాయి. నన్ను ట్రోల్ చేసిన ప్రతీ ఒక్కరికీ త్వరలోనే సమాధానం చెప్తాను”అంటూ సూపర్ కౌంటర్ వేశారు. దీంతో నాగ వంశీ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.