Nagavamsi : పాలిటిక్స్ అంటే పవన్ కళ్యాణ్ గారే.. అందుకే మహానాడుకు 25 లక్షలు ఇచ్చాను.. నాగవంశీ కామెంట్స్..

తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పాలిటిక్స్ పై మరోసారి ఆసక్తికర కామెంట్స్ చేసారు నాగవంశీ.(Nagavamsi)

  • Published on- August 7, 2026 / 09:19 PM IST

Nagavamsi

Nagavamsi : నిర్మాత నాగవంశీ రెగ్యులర్ గా మీడియా ముందు యాక్టివ్ గా ఉంటారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వరుసగా సినిమాలు చేస్తున్నారు. గతంలోనే పవన్ కళ్యాణ్ కే మా సపోర్ట్ పాలిటిక్స్ విషయంలో అని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు నాగవంశీ. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పాలిటిక్స్ పై మరోసారి ఆసక్తికర కామెంట్స్ చేసారు.

నాగవంశీ మాట్లాడుతూ.. నాకు పాలిటిక్స్ అంటే పవన్ కళ్యాణ్ గారే. ఆయన వెళ్లాకే పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది. అంతే కానీ నాకు ప్రత్యేకంగా పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ లేదు అని అన్నారు.

Also Read : Makutam Trailer : ‘మకుటం’ ట్రైలర్ వచ్చేసింది.. మూడు పాత్రల్లో విశాల్.. దర్శకుడిగా కూడా..

గతంలో నాగవంశీ టీడీపీ మహానాడు సభకు 25 లక్షలు విరాళం ఇవ్వడం చర్చగా మారింది. దానిపై కూడా స్పందిస్తూ.. నాకు పొలిటీషియన్స్ లో ఇద్దరు, ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు మహానాడు గురించి చెప్పారు. అందుకే మహానాడుకు 25 లక్షలు డొనేషన్ ఇచ్చాను. వాళ్ళు వాటర్ బాటిల్స్, ఫుడ్ కి ఆ డబ్బులను వాడారు. అది పుణ్యమే కదా అందుకే ఇచ్చాను అని తెలిపారు.