Producer Ravi clarifies on Kiran Abbavaram's comments
Kiran-Ravi: టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఇటీవల చేసిన కామెంట్స్ చర్చనీయాంశం అయిన విషయం తెలిసిందే. తెలుగులో తమిళ సినిమాలకు చాలా థియేటర్స్ ఇస్తున్నారు. కానీ, మన సినిమాలకు మాత్రం అక్కడ సరైన ఆదరణ లభించడం లేదని చెప్పాడు. తన (Kiran-Ravi)సినిమా రిలీజ్ టైం తమిళంలో తనకు థియేటర్స్ ఇవ్వము అని తన మొహం మీదే చెప్పారని ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో, ఆయన చేసిన కామెంట్స్ టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. తాజాగా ఇదే విషయంపై తెలుగు స్టార్ ప్రొడ్యూసర్ మైత్రి మూవీ మేకర్స్ అధినేత రవి స్పందించాడు.
తాజాగా ఆయన నిర్మాణంలో వచ్చిన డ్యూడ్ సినిమా ట్రైలర్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన థియేటర్స్ వివాదం గురించి మాట్లాడుతూ.. సినిమాలో మంచి కంటెంట్ ఉంటే బ్లాక్ బస్టర్ అవుతుంది. ఒకవేళ మా డ్యూడ్ సినిమా కన్నా అవతలి సినిమా బాగుంటే ఖచ్చితంగా షోలు పెరుగుతాయి. అలా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అంతే తప్పా నెంబర్ అఫ్ థియేటర్ల గురించి మాట్లాడటం కరక్ట్ కాదు. ఇక థియేటర్స్ విషయానికి వస్తే, ఏపీ, తెలంగాణతో పోల్చుకుంటే తమిళనాడులో థియేటర్ల సంఖ్య తక్కువ. అందుకే, ఈ సమస్య వస్తోంది. కానీ, ఎవరూ కావాలని చేసింది కాదు. ఫైనల్ గా సినిమా హిట్టు అయితే ఆటోమేటిక్ గా షోలు పెరుగుతాయి” అంటూ క్లారిటీ ఇచ్చాడు.
ఇక కిరణ్ అబ్బవరం హీరోగా వస్తున్న సినిమా కే-ర్యాంప్ అక్టోబర్ 18వ తేదీన, ప్రదీప్ రంగనాథన్ హీరోగా వస్తున్న డ్యూడ్ సినిమా అక్టోబర్ 17వ తేదీన విడుదల అవుతున్నాయి. ఈ రెండు సినిమాలు ఒకరోజు వ్యవధిలో విడుదల అవుతున్నాయి. దీంతో, తెలుగు సినిమా కంటే ఎక్కువగా తమిళ సినిమాకు ఎక్కువ థియేటర్స్ ఇవ్వడంపై ఈ వివాదం మొదలయ్యింది. మరి నిర్మాత రవి ఇచ్చిన క్లారిటీతో ఈ వివాదానికి ఎండ్ కార్డు పడుతుందా అనేది చూడాలి.