Producer SKN : విజయ్ దేవరకొండ అబద్దాలు చెప్పట్లేదు.. అతను మిడిల్ క్లాస్.. నెటిజన్‌కి కౌంటర్ ఇచ్చిన నిర్మాత SKN..

ఓ నెటిజన్ విజయ్ దేవరకొండ లైఫ్ స్టైల్ గురించి ఎవరో ఒకరు మాట్లాడాలి. అతను మరీ అంత పూర్ కాదు, బాగా ఉన్న ఫ్యామిలీ నుంచే వచ్చాడు అని కామెంట్స్ చేసాడు.

  • Updated on- April 4, 2024 / 10:42 AM IST

Producer SKN Counter to Netizen Who Comments Vijay Deverakonda Life Style

Producer SKN : విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) ఫ్యామిలీ స్టార్(Family Star) సినిమాతో ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. ఈ సినిమాలో విజయ్ ఓ మిడిల్ క్లాస్ వ్యక్తిగా నటిస్తున్నాడు. ప్రమోషన్స్ లో విజయ్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ, అలాగే తాను కూడా మిడిల్ క్లాస్ అని, చిన్నప్పట్నుంచి వాళ్ళ నాన్న మిడిల్ క్లాస్ అని, మిడిల్ క్లాస్ కష్టాలు చూశానని, ఇప్పుడు సక్సెస్ అయ్యాకే డబ్బులు సంపాదిస్తున్నాను చెప్పుకుంటూ వస్తున్నాడు.

ఓ ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. బండిలో పెట్రోల్ కూడా ఎప్పుడూ ఫుల్ కొట్టియ్యలేదు. పెళ్లి చూపులు సినిమా తర్వాతే ఫుల్ కొట్టించాను బండిలో పెట్రోల్ అని వ్యాఖ్యలు చేయగా దానికి ఓ నెటిజన్ రిప్లై ఇస్తూ.. విజయ్ దేవరకొండ లైఫ్ స్టైల్ గురించి ఎవరో ఒకరు మాట్లాడాలి. అతను మరీ అంత పూర్ కాదు, బాగా ఉన్న ఫ్యామిలీ నుంచే వచ్చాడు అని కామెంట్స్ చేసాడు.

Also Read : Anjali : అంజలి మళ్ళీ కంబ్యాక్ ఇస్తుందా.. ఈ ఇయర్ హ్యాట్రిక్ కొడుతుందా? ‘గేమ్ ఛేంజర్’తో సహా..

దీంతో ఆ నెటిజన్ కి బేబీ నిర్మాత SKN కౌంటర్ ఇస్తూ.. ఆయన మిడిల్ క్లాస్ బ్యాక్ గ్రౌండ్ అని కంటెంట్ బాగోకపోతే మనం సినిమా చూడము, రిచ్ అని కంటెంట్ బాగుంటే ఆగిపోము. ఇది అందరికి తెలుసు. అతను ఎలాంటి అబద్దాలు చెప్పట్లేదు. వాళ్ళు సింపుల్ మిడిల్ క్లాస్. శ్రీనగర్ కాలనిలో ఓ రెంట్ ఇంట్లో ఉన్నప్పటి నుంచి విజయ్ నాకు తెలుసు. పెళ్లి చూపులు తర్వాత వరకు కూడా అక్కడే ఉన్నాడు. కష్టపడి పైకి వచ్చిన వాళ్లకి నేను కష్టపడి పైకి వచ్చాను అని చెప్పుకోవడంలో ఒక సంతృప్తి ఉంటుంది. అందుకే ఆయన చెప్పుకుంటున్నాడు. నచ్చితే సినిమా చూడు, లేకపోతే వదిలేయ్. అంతేకాని ఇలా ఒకరి మీద పడి ఏడవటం ఎందుకు సోదరా. వీలుంటే అతని మాటలని ఆదర్శంగా తీసుకొని నువ్వు కూడా ఎదుగు, ఒక స్టేజి వచ్చాక సక్సెస్ అయితే ఆ తృప్తి నీకు తెలుస్తుంది అని అన్నాడు. దీంతో SKN ట్వీట్ వైరల్ అవ్వగా ఇక నిర్మాత SKN గతంలో విజయ్ దేవరకొండతో టాక్సీవాలా సినిమా తీసి హిట్ కొట్టారు. దీంతో విజయ్ గురించి SKNకి బాగా తెలుసు. అందుకే ఇలా కౌంటర్ ఇచ్చాడు అని విజయ్ అభిమానులు SKN ని అభినందిస్తూ ఈ ట్వీట్ ని తెగ షేర్ చేస్తున్నారు.