Project K Movie Unit started promotions in Comic Con Event at San Diego America with Project K Raiders
Project K Raiders : నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ (Prabhas) హీరోగా తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ మూవీ ప్రాజెక్ట్ K. వైజయంతి మూవీస్ బ్యానర్ పై దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే (Deepika Padukone), దిశా పఠాని, కమల్ హాసన్.. ఇలా స్టార్ క్యాస్ట్ నటిస్తున్నారు. ఇక ఈ సినిమా టైటిల్, ఫస్ట్ గ్లింప్స్ అమెరికా కాలిఫోర్నియాలోని San Diegoలో నిర్వహించే ప్రతిష్టాత్మక ఈవెంట్ కామిక్ కాన్ లో రిలీజ్ చేయబోతున్నట్టు ఆల్రెడీ ప్రకటించారు.
ఈ ఈవెంట్ లో పాల్గొనబోయే మొదటి ఇండియన్ సినిమాగా ప్రాజెక్ట్ K సరికొత్త రికార్డ్ సెట్ చేసింది. ఈ కార్యక్రమానికి దర్శక నిర్మాతలతో పాటు ప్రభాస్, కమల్ హాసన్ పాల్గొనబోతున్నారు. ఇప్పటికే ప్రభాస్, కమల్ హాసన్, చిత్రయూనిట్ అమెరికాకు చేరుకున్నట్టు హాలీవుడ్ నుంచి ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఫ్యాన్స్ ని ఖుషీ చేశారు. ఇక నిన్న సాయంత్రమే ప్రభాస్ ఫస్ట్ లుక్ ని కూడా రిలీజ్ చేశారు. సూపర్ మ్యాన్ లుక్ లో ప్రభాస్ ఫస్ట్ లుక్ అదిరింది.
ఇక అమెరికాలో కామిక్ కాన్ ఈవెంట్ మొదలైంది. ఈ ఈవెంట్ లో ప్రాజెక్ట్ K సినిమా ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టేసింది. గతంలో రైడర్స్ అంటూ ఓ వీడియోని రిలీజ్ చేసింది ప్రాజెక్ట్ K టీం. ఈ సినిమాల్లో వాళ్ళే విలన్ మనుషులు అని సమాచారం. ఒళ్ళంతా బ్లాక్ సూట్స్ తో ఫేస్ కూడా కవర్ చేసుకొని హాలీవుడ్ గెటప్స్ లా ఉన్నారు రైడర్స్. తాజాగా నేడు ఉదయం కొంతమందిని రైడర్స్ లా గెటప్స్ వేయించి కామిక్ కాన్ ఈవెంట్ లో ప్రాజెక్ట్ K సినిమాని ప్రమోట్ చేస్తున్నారు చిత్రయూనిట్. Now Begins The End అంటూ బ్యానర్స్ పట్టుకొని ప్రాజెక్ట్ K రైడర్స్ కామిక్ కాన్ ఈవెంట్ వద్ద హడావిడి చేస్తున్నారు. ఆ ఈవెంట్ కి వచ్చే ఆడియన్స్ పలువురు రైడర్స్ తో ఫోటోలు దిగుతున్నారు.
Project K : ప్రాజెక్ట్ K నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ వచ్చేసింది.. జటాజూటధారిగా ఇండియన్ సూపర్ హీరో..
దీంతో ప్రాజెక్ట్ K సినిమాని హాలీవుడ్ లో గట్టిగానే ప్రమోట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. రేపు జరగబోయే ఈవెంట్ లో ప్రాజెక్ట్ K సినిమా టైటిల్, గ్లింప్స్ కోసం అభిమానులతో పాటు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.