×
Ad

Revanath : పునీత్ కుటుంబంలో మరో మరణం.. విషాదంలో పునీత్ భార్య అశ్విని..

పునీత్ మరణం మరవకముందే ఆయన భార్య అశ్విని కుటుంబంలో మరో మరణం సంభవించింది. దీంతో ఆవిడ తీవ్ర విషాదంలోకి వెళ్లారు. పునీత్ రాజ్ కుమార్ మామ, అశ్విని తండ్రి రేవనాథ్ గుండెపోటుతో మరణించారు..

  • Published On : February 20, 2022 / 08:26 PM IST

Puneeth

Puneeth Rajkumar :  కన్నడ పవర్‌ స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ ఆకస్మిక మరణం చెందిన సంగతి తెలిసిందే. ఆయన మరణం కన్నడ చిత్ర పరిశ్రమకు మాత్రమే కాదు కన్నడ ప్రజలకు కూడా తీరని లోటు. గతేడాది అక్టోబర్ 29న ఆయన గుండెపోటుతో మరణించారు. ఆయన మరణం తర్వాత నేటికీ ఆయన అభిమానులు, కన్నడ ప్రజలు, ఎంతో మంది ప్రముఖులు ఆయనకి నివాళులు అర్పిస్తున్నారు. అయన మరణంతో పునీత్ భార్య అశ్విని ఇప్పటికి బయటకి రావట్లేదు. ఆమె ఇంకా శోక సంద్రంలోనే ఉన్నారు.

పునీత్ మరణం మరవకముందే ఆయన భార్య అశ్విని కుటుంబంలో మరో మరణం సంభవించింది. దీంతో ఆవిడ తీవ్ర విషాదంలోకి వెళ్లారు. పునీత్ రాజ్ కుమార్ మామ, అశ్విని తండ్రి రేవనాథ్ గుండెపోటుతో మరణించారు. కొద్దిసేపటి క్రితమే (ఫిబ్రవరి 20న) ఆయన మృతి చెందడంతో మరోసారి అశ్విని కుటుంబం అంతా శోకసంద్రంలో మునిగిపోయింది.

Kangana Ranaut : మూవీ మాఫియా అంటూ అలియా సినిమాపై ఫైర్ అయిన కంగనా..

అశ్విని తండ్రి రేవనాథ్ వయసు 78 సంవత్సరాలు. 20 ఏళ్ల క్రితం రేవనాథ్ యాంజియోప్లాస్టీ చేయించుకున్నారు. రేవనాథ్ ఎన్‌హెచ్‌ఏఐ చీఫ్ ఇంజనీర్‌గా పని చేసి రిటైర్ అయ్యారు. ఆయన బెంగళూరులోని M.S.రామయ్య హాస్పిటల్లో చికిత్స పొందుతూమరణించారు. కొన్ని నెలల క్రితమే గుండెపోటుతో పునీత్ మరణించడం, ఇప్పుడు పునీత్ మామ మరణించడంతో పునీత్ భార్య అశ్విని తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. ఆయన అంత్యక్రియలు సోమవారం జరగనున్నాయి. ఈ అంత్యక్రియలకు పునీత్ కుటుంబ సభ్యులు కూడా హాజరు కానున్నారు.