James : పునీత్ చివరి సినిమా టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. వెయిట్ చేస్తున్న అభిమానులు
పునీత్ రాజ్‌కుమార్ నటించిన చివరి చిత్రం ‘జేమ్స్’ విడుదలకు రెడీ అయిందని ఇటీవల తెలిపారు. మార్చి17న ‘జేమ్స్’ చిత్రాన్ని విడుదల చేయడానికి రెడీ చేస్తున్నామని మేకర్స్ తెలిపారు........
- Saketh U
- Updated on- February 8, 2022 / 10:17 AM IST
James
Puneeth Rajkumar : కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ ఆకస్మిక మరణం చెందిన సంగతి తెలిసిందే. ఆయన మరణం కన్నడ చిత్ర పరిశ్రమకు మాత్రమే కాదు కన్నడ ప్రజలకు కూడా తీరని లోటు. గతేడాది అక్టోబర్ 29న ఆయన గుండెపోటుతో మరణించారు. ఆయన మరణం తర్వాత నేటికీ ఆయన అభిమానులు, కన్నడ ప్రజలు, ఎంతో మంది ప్రముఖులు ఆయనకీ నివాళులు అర్పిస్తున్నారు.
అయితే ఆయన నటించిన చివరి చిత్రం ‘జేమ్స్’ విడుదలకు రెడీ అయిందని ఇటీవల తెలిపారు. మార్చి17న ‘జేమ్స్’ చిత్రాన్ని విడుదల చేయడానికి రెడీ చేస్తున్నామని మేకర్స్ తెలిపారు. ఇటీవల రిపబ్లిక్ డే సందర్భంగా ‘జేమ్స్’ స్పెషల్ పోస్టర్ని విడుదల చేశారు. ఇందులో ఆయన సైనికుడిలా కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. చేతన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రియా ఆనంద్ హీరోయిన్గా, శ్రీకాంత్ విలన్‌గా నటించారు.
DJ Tillu : ట్రైలర్ చూసి ముగ్గురు నిర్మాతలు సినిమా చేద్దామన్నారు : DJ టిల్లు డైరెక్టర్
ఇటీవలే ఈ సినిమా డబ్బింగ్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. పునీత్ పాత్రకి అయన అన్న శివరాజ్ కుమార్ డబ్బింగ్ చెప్పారు. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ‘జేమ్స్’ టీజర్ ని విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. పునీత్ నటించిన చివరి సినిమా ‘జేమ్స్’ టీజర్ ని ఫిబ్రవరి 11 ఉదయం 11:11కి రిలీజ్ చేయనున్నారు. దీంతో పునీత్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పునీత్ చివరి సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
