Pushpa 2 : ఆ మూడు రాష్ట్రాల్లో పుష్ప 2 సరికొత్త రికార్డు.. మొదటి తెలుగు సినిమాగా..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతుంది.

Pushpa 2 movie new record in those three states

Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతుంది. సుకుమార్ దర్శకత్వంలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమా మొదటి షో నుండే మంచి సక్సెస్ తో దూసుకుపోతుంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా కాసుల వర్షం కురిపిస్తుంది. ఇప్పటికే మొదటిరోజు 294 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.

Also Read : Janhvi Kapoor : ‘పుష్ప 2 కూడా సినిమానే కదా.. చాలా బాధగా ఉంది’.. వారిపై జాన్వీ ఫైర్.. అసలేం జరిగిందంటే..

అయితే పుష్ప 2 సినిమా మొదటి ఆట నుండే.. తమిళ నాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో సైతం కలెక్షన్స్ విషయంలో దుమ్ములేపుతున్నాయి. కాగా తమిళనాడులో మొదటిరోజు పుష్ప2 సినిమా 11కోట్ల గ్రాస్ వసూలు చేసింది. కేరళ 6.35 కోట్ల గ్రాస్ వసూలు చెయ్యగా.. హైయెస్ట్ కర్ణాటక కలెక్ట్ చేసింది. ఏకంగా 23.7 కోట్ల గ్రాస్ వసూలు చేసి ఆల్ టైమ్ రికార్డ్ బ్రేక్ చేసింది పుష్ప 2. మరో విషయం ఏంటంటే.. ఒక తెలుగు డబ్బింగ్ సినిమాకి తమిళ నాడు, కర్ణాటక, కేరళ వంటి రాష్ట్రాల్లో ఈ స్థాయిలో కలెక్షన్స్ రావడం విశేషం అని చెప్పొచ్చు. ఇప్పటి వరకు ఏ స్టార్ హీరో అందుకోని ఈ ఘనత బన్నీ అందుకున్నాడు.


దీంతో ఈ వార్త నెట్టింట వైరల్ అవుతుంది. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. డిసెంబర్ 5న పాన్ ఇండియా లెవెల్ లో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా అంచనాలకి తగ్గట్టు గానే మంచి సక్సెస్ అందుకుంటుంది. ఇప్పటికే పుష్ప 1 తో భారీ విజయాన్ని అందుకున్న మూవీ టీమ్ ఇప్పుడు పుష్ప 2 తో మరింత పెద్ద సక్సెస్ అందుకుంటున్నారు.