Pushpa 2 Producer Interesting Comments on Allu Arjun and Jathara Episode
Pushpa 2 : సుకుమార్ – అల్లు అర్జున్ కాంబోలో రాబోతున్న పుష్ప 2 సినిమా ఒక రోజు ముందుకు జరిగి డిసెంబర్ 5 నే రిలీజ్ చేయబోతున్నట్టు మూవీ యూనిట్ నేడు ఓ కొత్త పోస్టర్ తో రిలీజ్ చేస్తూ ప్రకటించింది. నేడు పుష్ప 2 నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ స్పెషల్ ప్రెస్ మీట్ పెట్టి పుష్ప గురించి పలు అంశాలు మాట్లాడారు. అలాగే మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.
Also Read : Jani Master : బ్రేకింగ్ న్యూస్.. జానీ మాస్టర్ కు బెయిల్ మంజూరు..
ఇప్పటికే పుష్ప సినిమాలో గంగమ్మ జాతర ఎపిసోడ్ నుంచో గ్లింప్స్, పోస్టర్స్ రిలీజ్ చేసారు. ఇందులో అల్లు అర్జున్ చీర కట్టుకొని అదిరిపోయేలా చేసారని తెలుస్తుంది. పుష్ప 2 నిర్మాత జాతర ఎపిసోడ్ గురించి మాట్లాడుతూ.. జాతర ఎపిసోడ్ కి బాగానే కష్టపడ్డాం. 35 రోజులు షూట్ చేసాం. 20 రోజులు వర్క్ షాప్ కూడా చేశారు. అల్లు అర్జున్ రోజూ బాడీకి పెయింట్ వేసుకొని, చీర కట్టుకొని చాలా కష్టపడ్డారు. ఆయన కష్టం ఎవరూ పడలేరు. సుకుమార్, అల్లు అర్జున్ గారు ఇద్దరూ కష్టపడ్డారు. వాళ్ళ కష్టానికి ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి. జాతర సెటప్ ఇప్పటి వరకు ఎవరూ చేయనిది. గూస్ బంప్స్ ఎపిసోడ్ అది. ఆ ఎపిసోడ్ వరకు బాగానే ఖర్చు పెట్టాము అని అన్నారు. దీంతో ఫ్యాన్స్ ఆ జాతర ఎపిసోడ్ పై అంచనాలు పెంచేసుకుంటున్నారు.