Dadasaheb Phalke Award 2022: బెస్ట్ ఫిల్మ్ అవార్డు దక్కించుకున్న పుష్ప

పుష్ప.. పుష్పరాజ్.. తగ్గేదేలే. ఏ ముహూర్తాన సుకుమార్ బన్నీతో ఈ డైలాగ్ చెప్పించాడో కానీ.. బన్నీ లైఫ్ టర్న్ అయిపొయింది. పాండమిక్ సమయంలో కూడా ప్రపంచ వ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ ను..

Dadasaheb Phalke Award 2022: బెస్ట్ ఫిల్మ్ అవార్డు దక్కించుకున్న పుష్ప

Pushpa (1)

Updated On : February 21, 2022 / 10:57 AM IST

Dadasaheb Phalke Award 2022: పుష్ప.. పుష్పరాజ్.. తగ్గేదేలే. ఏ ముహూర్తాన సుకుమార్ బన్నీతో ఈ డైలాగ్ చెప్పించాడో కానీ.. బన్నీ లైఫ్ టర్న్ అయిపొయింది. పాండమిక్ సమయంలో కూడా ప్రపంచ వ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ ను కొల్లగొట్టిన ఈ సినిమా అల్లు అర్జున్ ను పాన్ ఇండియా స్టార్ ను చేసేసింది. ముఖ్యంగా ఉత్తరాదిన బన్నీని స్పెషల్ స్టార్ ను చేసేసింది. దక్షణాది అన్ని బాషల కంటే హిందీ ప్రేక్షకులు ఈ సినిమాకి బ్రహ్మరధం పట్టారు.

Pushpa 2: టీమ్ వర్క్ మొదలు పెట్టిన పుష్పరాజ్.. అనుకున్నట్లే రిలీజ్!

తగ్గేదేలే అంటూ లాస్ట్ ఇయర్ డిసెంబర్ 17న వరల్డ్ వైడ్ గా థియేటర్లో కొచ్చిన పుష్పరాజ్.. భారీ వసూళ్లు సాధించి, సౌత్ ఇండియా ఆడియన్స్ నుంచి, నార్త్ ఇండియా స్టార్స్ వరకు అందరికీ షాకిచ్చాడు. అసలే కోవిడ్ భయంతో గడ్డుకాలంలో ఉన్న ఇండస్ట్రీకి బాసటగా నిలిచాడు. ఇక ఈ సినిమా సాంగ్స్ ఇప్పటికీ ప్రజల నోళ్ళలో నానుతుంటే.. పిల్లల నుండి పెద్దల వరకు సాంగ్స్, డైలాగ్స్ తో మీమ్స్, షార్ట్స్ చేస్తూ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే సందడి కనిపిస్తుంది.

Pushpa Hook Step: ఏంటీ.. క్రికెటర్లు డబ్బు తీసుకొని పుష్ప స్టెప్ వేశారా?

పుష్ప ఈ ఏడాది అవార్డుల పంట దక్కించుకోవడం ఖాయమని సినిమా రిలీజ్ అయినప్పుడే విశ్లేషకులు తేల్చేయగా.. ఇప్పడు ఆ పరంపర మొదలయింది. తొలి అవార్డ్ ప్రతిష్టాత్మకమైన అవార్డును గెలుచుకుంది. ఈ చిత్రం ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2022 అవార్డ్స్ లో బెస్ట్ ఫిల్మ్ అవార్డ్ ను గెలుపొందింది. అవార్డ్ రావడం పట్ల చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది. కాగా ఈ సినిమా రెండవ పార్ట్ పుష్ప ది రూల్ త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది.