Pushpa Hook Step: ఏంటీ.. క్రికెటర్లు డబ్బు తీసుకొని పుష్ప స్టెప్ వేశారా?

అల్లు అర్జున్ ను ఐకాన్ స్టార్ గా.. పాన్ ఇండియా స్టార్ గా మార్చేసిన సినిమా పుష్ప. ఇందులో బన్నీ యాక్టింగ్, మేకోవర్, డాన్స్ ఇండియా మొత్తం తగ నచ్చేసింది.

Pushpa Hook Step: ఏంటీ.. క్రికెటర్లు డబ్బు తీసుకొని పుష్ప స్టెప్ వేశారా?

Pushpa Hook Step

Pushpa Hook Step: అల్లు అర్జున్ ను ఐకాన్ స్టార్ గా.. పాన్ ఇండియా స్టార్ గా మార్చేసిన సినిమా పుష్ప. ఇందులో బన్నీ యాక్టింగ్, మేకోవర్, డాన్స్ ఇండియా మొత్తం తగ నచ్చేసింది. ఇక ఈ సినిమాలో పాటలు, డాన్స్ అయితే షేక్ చేసేశాయి. గతంలో అల వైకుంఠపురంలో బుట్టబొమ్మ తర్వాత పుష్పలో శ్రీవల్లి పాట.. అందుకో బన్నీ హుక్ స్టెప్ అంత పాపులర్ అయింది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా హుక్ స్టెప్ షాట్ వీడియోలే కనిపిస్తున్నాయి.

Salaar: సలార్ కూడా రెండు పార్టులా.. నీల్ ప్లాన్ ఏంటి?

సామాన్య ప్రేక్షకుల నుండి సెలబ్రిటీల వరకు ఈ పాటకి కాలు కదుపుతూ వీడియోలు చేసి పోస్ట్ చేస్తున్నారు. ఇక క్రికెటర్లు కూడా ఈ హుక్ స్టెప్ కి డాన్స్ చేసిన వీడియోలు తెగ వైరల్ అయ్యాయి. ముందుగా డేవిడ్ వార్నర్ శ్రీవల్లి స్టెప్ ను రిక్రియేషన్ చేయగా పలువురు అంతర్జాతీయ క్రికెటర్లు.. భారతీయ క్రికెటర్లు దీనిని అనుసరించారు. సురేష్ రైనా నుండి డ్వేన్ బ్రావో వరకు చాలా మంది క్రికెటర్లు ఈ స్టెప్ చేసి వారి సోషల్ మీడియా హ్యాండిల్స్ లో పంచుకున్నారు.

Ram Charan-Sreeja: ముంబై నుండి శ్రీజ ఎమోషనల్ పోస్ట్.. అసలేం జరుగుతుంది?

అయితే, ఈ ప్రతి క్రికెటర్ కి, ఆ డాన్స్ చేసినందుకు, ఆ పోస్ట్ సోషల్ మీడియాలో పంచుకున్నందుకు డబ్బు చెల్లించారనేది షాకింగ్ ట్విస్టుగా మారింది. పుష్ప సినిమాకి ప్రమోషన్ లో భాగంగా అమెజాన్ ప్రైమ్ క్రికెటర్లకు డబ్బు చెల్లించి ఈ వీడియోలు చేయించిందని సోషల్ మీడియాలో ఓ టాక్ నడుస్తుంది. చాలామంది ఈ సినిమా, శ్రీవల్లి హుక్ స్టెప్, బన్నీ కోసమే స్టెప్ వేసిన ప్రముఖులు ఉండగా.. క్రికెట్ సెలబ్రిటీలకు మాత్రం అమెజాన్ డబ్బు చెల్లించి ఈ ప్రమోషన్ చేయించిందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

Pushpa: హిందీలో వంద కోట్ల క్లబ్ లో చేరిన పుష్ప!