Salaar: సలార్ కూడా రెండు పార్టులా.. నీల్ ప్లాన్ ఏంటి?

ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియాకే స్టార్. ఒకటి కాదు రెండు కాదు దాదాపు అరడజను పాన్ ఇండియా సినిమాలతో దాదాపు రెండు వేల కోట్ల సినిమాలతో..

Salaar: సలార్ కూడా రెండు పార్టులా.. నీల్ ప్లాన్ ఏంటి?

Salaar

Salaar: ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియాకే స్టార్. ఒకటి కాదు రెండు కాదు దాదాపు అరడజను పాన్ ఇండియా సినిమాలతో దాదాపు రెండు వేల కోట్ల సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న స్టార్ మన డార్లింగ్ ప్రభాస్. ప్రస్తుతం ప్రభాస్ సినిమాలలో కన్నడ స్టార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ సలార్ సినిమా కూడా ఒకటి. ఈ సినిమా ఎప్పుడో పూర్తి కావాల్సి ఉండగా కరోనా కారణంగా షూటింగ్ పూర్తి కాలేదు. మరోవైపు ప్రశాంత్ కూడా యాక్షన్ సన్నివేశాలను రీషూట్ చేస్తున్నారని టాక్.

Ram Charan-Sreeja: ముంబై నుండి శ్రీజ ఎమోషనల్ పోస్ట్.. అసలేం జరుగుతుంది?

అయితే.. ఇప్పుడు కొత్తగా మరో ప్రచారం మొదలైంది. ప్రశాంత్ నీల్ ను స్టార్ దర్శకుడిని చేసిన కేజేఎఫ్ మాదిరే సలార్ కూడా రెండు పార్టులుగా రాబోతుందని సోషల్ మీడియాలో ఓ టాక్ నడుస్తుంది. గతంలో బాహుబలి, కేజేఎఫ్, పుష్ప సినిమాలు కూడా ముందు ఒక సినిమాగా మొదలై రెండు పార్టులుగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సలార్ కూడా అదే మాదిరి రెండు పార్టులుగా రాబోతుందని డార్లింగ్ ఫ్యాన్స్ ఓ లాజిక్ స్ప్రెడ్ చేస్తున్నారు.

Pushpa: హిందీలో వంద కోట్ల క్లబ్ లో చేరిన పుష్ప!

రెండు పార్టులు తెరకెక్కుతుంది కాబట్టే మళ్ళీ రీ షూట్ చేస్తున్నారని.. యాక్షన్ సన్నివేశాలని కూడా టెక్నాలజీ సాయంతో హాలీవుడ్ రేంజ్ లో సిద్ధం చేస్తున్నారని చెప్తున్నారు. మొదటి భాగం ఈ ఏడాది అక్టోబర్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారని.. రెండవ భాగం 2023 సమ్మర్ లో రిలీజ్ చేస్తారని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. ఇప్పటి వరకు అయితే మేకర్స్ నుండి ఈ ప్రచారంపై ఎలాంటి స్పందన లేదు.. అలా అని నిజమే అన్నది కూడా లేదు. మరి మేకర్స్ రెస్పాండ్ అయితేనే దీనిపై క్లారిటీ వచ్చేది.