raadhika said what is unlike in chiranjeevi and what is like in balakrishna
Unstoppable episode 4 : నందమూరి నటసింహ బాలకృష్ణ వ్యాఖ్యాతగా ప్రముఖ ఓటిటి ప్లాట్‌ఫార్మ్ ‘ఆహా’లో ప్రసారమవుతున్న ‘అన్‌స్టాపబుల్ విత్ NBK’ టాక్ షోకి రెండు తెలుగు రాష్ట్రాల్లో అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. ఇక రెండో సీజన్ మొదటి ఎపిసోడ్‌ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో స్టార్ట్ చేసి సంచలనం సృష్టించారు. తాజాగా నాలుగో ఎపిసోడ్ లో బాలయ్య తన పాత స్నేహితులతో కలిసి సందడి చేశాడు.
Unstoppable episode 4 : రజినీకాంత్ పెద్ద బోరింగ్ మనిషి.. రాధిక!
ఈ ఎపిసోడ్ కి అతిథిలుగా.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఇప్పటి తెలంగాణ ఎంపీ సురేష్ రెడ్డి హాజరయ్యారు. అయితే ఇదే షోలో ఒక్కప్పటి స్టార్ హీరోయిన్ రాధిక కూడా సందడి చేసింది. కాగా బాలయ్య, రాధిక వర్క్ చేసిన హీరోలపై తన అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నాడు. ఈ క్రమంలోనే బాలయ్య.. చిరంజీవిలో నచ్చనిది ఏంటి? నాలో నచ్చేది ఏంటి? అని ప్రశ్నించాడు.
ఈ ప్రశ్నలకు రాధిక బదులిస్తూ.. “నీతో నేను ఎప్పుడు గొడవ పడను. కానీ చిరంజీవి నేను ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటాం. నేను ఎక్కువుగా మాట్లాడతానని, నన్ను తిడుతుంటాడు. నేను తిరిగి తిడుతుంటా. అలా ఇద్దరం ఎప్పుడు కొట్టుకుంటేనే ఉంటాం. మా ఇద్దరి మధ్య సురేఖ అంపైర్ లా ఉంటుంది. చిరుతో సరదా ఉండదు అసలు” అంటూ చెప్పుకొచ్చింది.