కోలీవుడ్‌లో త్రిష ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘రాంగి’ మూవీ టీజర్ విడుదల..
తెలుగు, తమిళ్ ప్రేక్షకులను ఆకట్టుకున్న కథానాయిక త్రిష, విజయ్ సేతుపతితో నటించిన ’96’ ఘన విజయంతో మళ్ళీ ట్రాక్‌లోకి వచ్చింది. హీరోయిన్‌గా చేస్తూనే, కాన్సెప్ట్ నచ్చితే లేడీ ఓరియంటెడ్ సినిమాలూ చేస్తుంది.
కోలీవుడ్‌లో త్రిష ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘రాంగి’.. లైకా ప్రొడక్షన్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి స్టార్ డైరెక్టర్ ఏ.ఆర్.మురుగదాస్ కథ అందించగా, ఎమ్.శరవణన్ డైరెక్ట్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు.
త్రిష ఫస్ట్ టైమ్ ఫుల్ యాక్షన్ సీన్స్‌లో అదరగొట్టేసింది. టీజర్‌లో ఎటువంటి డైలాగ్స్ లేవు కానీ త్రిషలోని యాక్షన్ యాంగిల్ ఎలా ఉండబోతుదో చూపించారు. విజువల్స్, ఆర్ఆర్ బాగున్నాయి. 2020లో ‘రాంగి’ ప్రేక్షకుల ముందుకు రానుంది.