Radhe Shyam : సంక్రాంతి రిలీజ్..! అప్‌డేట్ ఆన్ ది వే డార్లింగ్స్..
ఎట్టకేలకు ‘రాధే శ్యామ్’ షూటింగ్‌కి గుమ్మడికాయ కొట్టేశారు.. మరో మూడు రోజుల్లో అఫీషియల్ అప్‌డేట్ ఇవ్వబోతున్నట్లు డైరెక్టర్ ట్వీట్ చేశారు..
- sekhar
- Published On : July 29, 2021 / 12:12 PM IST
Prabhas
Radhe Shyam: రెబల్ స్టార్ ప్రభాస్, గోర్జియస్ బ్యూటీ పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్న రొమాంటిక్ లవ్లీ ఎంటర్‌టైనర్.. ‘రాధే శ్యామ్’. పాన్ ఇండియన్ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాపై అన్ని భాషల్లో కూడా భారీగా అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రభాస్, పూజా హెగ్డే ఫస్ట్‌లుక్ పోస్టర్లు, మోషన్ పోస్టర్‌తో పాటు ప్రేమికుల రోజు విడుదల చేసిన రొమాంటిక్ గ్లింప్స్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
Radhe Shyam : ‘రాధే శ్యామ్’ క్లైమాక్స్ సీన్ లీక్..!
దాదాపు మూడేళ్లుగా ఈ సినిమా కోసం పనిచేస్తున్నారు ప్రభాస్ అండ్ రాధా కృష్ణ.. రిలీజ్ కోసం ఫ్యాన్స్, మూవీ లవర్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఒకానొక టైంలో రిలీజ్ సంగతి పక్కన పెట్టి కనీసం ఏదో ఒక అప్‌డేట్ ఇవ్వండంటూ ఫ్యాన్స్, మేకర్స్ మీద అసహనం వ్యక్తం చేశారు. వాళ్ల నిరీక్షణ ఫలించింది. ఎట్టకేలకు ‘రాధే శ్యామ్’ షూటింగ్‌కి గుమ్మడికాయ కొట్టేశారు. మరో మూడు రోజుల్లో అఫీషియల్ అప్‌డేట్ ఇవ్వబోతున్నట్లు డైరెక్టర్ ట్వీట్ చేశారు.
‘రాధే శ్యామ్’ సంక్రాంతికి రిలీజ్ అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ప్రభాస్ టీం తో కలిసి ఉన్న పిక్ నెట్టింట హల్ చల్ చేస్తుంది. రెబల్ స్టార్ డా.యూ.వి.కృష్ణంరాజు సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్ధలు గోపీ కృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్‌తో ‘రాధే శ్యామ్’ సినిమాను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు.
Prabhas Movies : రిలీజ్‌కు పోటీ పడుతున్న ప్రభాస్ సినిమాలు..
వంశీ, ప్రమోద్, ప్రసీద (ప్రభాస్ సిస్టర్) ఈ పాన్ ఇండియా సినిమాకు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ జస్టిన్ ప్రభాకరన్ ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు, కన్నడ, తమిళ, మళయాలీ వెర్షన్స్‌కు సంగీతాన్ని అందిస్తున్నారు. హిందీ వెర్షన్‌కు మిథూన్, మనన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు.
3 days more for the official update !!! Let’s all wait ?????????
— Radha Krishna Kumar (@director_radhaa) July 28, 2021
